హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో(Manhole) ఓ చిన్నారి పడిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బాలిక తల్లి సమయానికి స్పందించి రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులనే విషయంపై గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైడ్రా, జలమండలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొదట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ హైడ్రాకు(Hydra) నోటీసులు పంపగా, హైడ్రా జలమండలిని తప్పుబట్టింది. అయితే, ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

హైడ్రా కమిషనర్ అంగీకారం
ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) స్పందించి, తప్పు తమ సిబ్బందిదేనని అంగీకరించారు. యాకత్‌పురాలో మ్యాన్‌హోల్‌ను తెరిచింది, ఆ తర్వాత మూత వేయడం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనని విచారణలో తేలిందని ఆయన తెలిపారు. ఆరేళ్ల పాప మ్యాన్‌హోల్‌లో పడడానికి ప్రధాన కారణం హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యమేనని కమిషనర్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
చిన్నారి ఏ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడింది?
హైదరాబాద్ పాతబస్తీలోని యాకత్‌పురాలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో చిన్నారికి ఏమైనా గాయాలయ్యాయా?
చిన్నారి తల్లి సమయానికి స్పందించి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: