బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ ప్రభుత్వానికి తల తోక లేనిదని ఎక్కువ రోజులు రేవంత్ సర్కార్ కొనసాగదని సంచలన కామెంట్స్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Malkajgiri District) బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బాధితులకు భరోసా కల్పించేందుకు అక్కడికి చేరుకుని మాట్లాడారు.అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.ఇది తుగ్లక్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ పెద్ద ఒక శాడిస్ట్, సైకో ప్రజల జోలికి వస్తే ఖబర్దార్’ అంటూ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏడిపించడంలోనే సీఎం రేవంత్(CM Revanth)ఆనందం పొందుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి వెనక ఏం జరుగుతుంతో తెలియటం లేదని,ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. వ్యవస్థను సరిదిద్దుకోవాలని సూచించారు.

పరిపాలన
ప్రజల జీవితాలతో ఆడుకునేవారు ఎవరూ బాగుపడరని ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని శపించారు. కూల్చివేతలపై ఎమ్మార్వో నోటీసులు జారీ చేస్తే కలెక్టర్ తనకు తెలియదని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకుంటే అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారుల బుద్ధి, జ్ఞానం ఏమైందని నిలదీశారు. ప్రభుత్వం ప్రజల ఇళ్లను కూల్చివేయగలదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు పగ, కసితో ఎదురుచూస్తున్నారని ఆయన హెచ్చరించారు.గతంలో కూడా ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి ఒక జోకర్ ఆయనకు పరిపాలన చేతకాదు’ అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదని వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని,కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగానే తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read Also : Telangana: సోషల్ మీడియాలోవ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు: సజ్జనార్