Bengaluru: మహిళ మృతదేహం కేసులో భర్త అరెస్ట్..

Bengaluru: మహిళ మృతదేహం కేసులో భర్త అరెస్ట్..

బెంగళూరులోని హుళిమావు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవడం సంచలనం రేపింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32) గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32) ను హత్య చేసి, ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేస్‌లో నింపాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా బెంగళూరులోని హులిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisements

ఫోరెన్సిక్ బృందం

మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన వారు గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు.సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారు అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్‌కేసు కనిపించిందని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

gouri

నిందితుడు అరెస్ట్

పూణె పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసిందని హుళిమావు పోలీసులు తెలిపారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేశ్ పూణెకు పారిపోయి అక్కడి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని బెంగళూరుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందం పూణెకు బయలుదేరింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌరీ, రాకేశ్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని బెంగళూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాకేశ్ ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తుండగా, గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

సంఘటనలు

గత కొంతకాలంగా రాజస్థాన్, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతున్నాయి.ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది.బెంగళూరులో చోటుచేసుకున్న ఈ దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అనే అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాకేశ్ బెంగళూరుకు చేరుకున్న తర్వాత విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది.

Related Posts
sunita williams: భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్-సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది?
భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్- ఓసారి చరిత్రలోకి తొంగిచూద్దాం

ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం Read more

పనామాలోని హోటల్లో బందీలుగా భారతీయులు!
పనామాలోని హోటల్లో బందీలుగా భారతీయులు!

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ ప్రక్రియలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తమ వలసల్ని స్వీకరించేందుకు పలు Read more

లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. ఈ Read more

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో : ప్రళయ్ క్షిపణి ఆకర్షణ
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రళయ్ క్షిపణి ఆకర్షణ

ఈ సంవత్సరం జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ భారత సైనిక శక్తి,సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనుంది. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకొని,ప్రత్యేక Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×