Bengaluru: మహిళ మృతదేహం కేసులో భర్త అరెస్ట్..

Bengaluru: మహిళ మృతదేహం కేసులో భర్త అరెస్ట్..

బెంగళూరులోని హుళిమావు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవడం సంచలనం రేపింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32) గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32) ను హత్య చేసి, ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేస్‌లో నింపాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా బెంగళూరులోని హులిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisements

ఫోరెన్సిక్ బృందం

మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన వారు గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు.సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారు అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్‌కేసు కనిపించిందని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

gouri

నిందితుడు అరెస్ట్

పూణె పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసిందని హుళిమావు పోలీసులు తెలిపారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేశ్ పూణెకు పారిపోయి అక్కడి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని బెంగళూరుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందం పూణెకు బయలుదేరింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌరీ, రాకేశ్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని బెంగళూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాకేశ్ ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తుండగా, గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

సంఘటనలు

గత కొంతకాలంగా రాజస్థాన్, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతున్నాయి.ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది.బెంగళూరులో చోటుచేసుకున్న ఈ దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అనే అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాకేశ్ బెంగళూరుకు చేరుకున్న తర్వాత విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది.

Related Posts
ONDC చిన్న వ్యాపారాలకు సాధికారత: మోదీ
ONDC చిన్న వ్యాపారాలకు సాధికారత: మోదీ

ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించి, ఇ-కామర్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం Read more

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy leaves for Delhi

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష Read more

ఆదానీ గ్రూప్ పై అవినీతి ఆరోపణలపై JPC విచారణను కోరిన కాంగ్రెస్ ఎంపీ
sayyad hussain

కాంగ్రస్ ఎంపీ డా. సయద్ హుస్సేన్, గౌతమ్ ఆదానీ మరియు ప్రధాన మంత్రి మోదీపై తీవ్రమైన ఆరోపణలు చేసినారు. ఆయన మాట్లాడుతూ, NITI ఆయోగ్ నియమాల ప్రకారం Read more

Trade War: చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్
చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్

అమెరికా - చైనా మధ్య సుంకాల యుద్ధం ముదురుతోంది. మొదట అమెరికా ప్రపంచ దేశాల పై కొత్త సుంకాలు ప్రకటించిన తర్వాత చైనా కూడా వెంటనే అమెరికా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×