ఉలవలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహార పదార్థం.ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.చలికాలంలో ఉలవలు(Horse Gram) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది. ఉలవల్లో ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు(Digestive problems) దూరమవుతాయి. అజీర్తి బాధపడేవారు రెగ్యులర్‌గా ఉలవలు తింటే చాలా వరకూ డైజెషన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. దీనిలోని గుణాల కారణంగా తక్షణ శక్తి పొందుతారు. పోషకాహారం లోపం ఉన్నవారు ఉలవల్ని తీసుకుంటే చాలా మంచిది.

సలహాతో
ఉలవలు తినడం వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పచ్చి ఉలవల్లో ఇన్సులిన్(Insulin) రెసిస్టెన్స్ తగ్గించే గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది. అయితే, మోతాదులోనే తీసుకోవాలి.

కొలెస్ట్రాల్
రక్తహీనతతో బాధపడేవారు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఉలవల్ని తింటే రక్తం పెరుగుతుంది. వీటిని రోజుకి రెండు చెంచాలైనా తీసుకుంటే రక్తహీనత(Anemia), ఎముకల సమస్యల వంటివి ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాదు, ఉలవలకి రక్తనాళాలల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేందుకు హెల్ప్ చేస్తాయి. ఉలవల్ని తినడం వల్ల గుండెకి రక్త సరఫరాని మెరుగ్గా చేస్తుంది. దీంతో గుండె సమస్యలు రావు. మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి.ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఉలవల్ని మనం గుగ్గిల్లు, స్నాక్స్, ఉలవచారు, ఉలవచారు బిర్యానీ ఇలా ఎన్నో రకాలుగా మన డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచింది.

సమస్యల్ని
ఉలవల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్(Antibacteria) గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ దూరం చేసి కొన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారు.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read Also: Dark Circles: ఈ చిట్కాలతో నల్లని వలయాలు మాయం