ఆయుర్వేదం ప్రకారం, మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యత ఆరోగ్యానికి కీలకం. ఈ దోషాలలో అసమతుల్యత అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిత్త దోషం పెరిగినప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు, అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేద టీ సేవించడం ద్వారా పిత్త దోషాన్ని తగ్గించుకోవచ్చు.

పిత్తం అనేది జీర్ణవ్యవస్థ పనితీరుకు కీలకం. ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ పిత్తం ఎక్కువైపోతే లేదా తక్కువైతే, శరీరంలోని సమతుల్యత దెబ్బతినిపోతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరం, అజీర్తి మొదలైనవన్నీ దీని పరిణామాలే. దీర్ఘకాలంగా కొనసాగితే, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఆయుర్వేద టీ – సహజమైన పరిష్కారం
ఈ పిత్త దోషాన్ని తగ్గించేందుకు ఆయుర్వేద టీ చాలా మేలు చేస్తుంది. ఇది పిత్తాన్ని సమతుల్యంగా ఉంచుతూ, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆయుర్వేద టీ వల్ల కలిగే ప్రయోజనాలు:
- జీర్ణ రసాల ఉత్పత్తిని సరిచేస్తుంది
- జఠరాగ్ని (digestive fire)ని ఉత్తేజింపజేస్తుంది
- అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
- శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది
- బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
- రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

ఆయుర్వేద టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కాస్త ఓపిక ఉంటే చాలు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఈ టీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసింది కనుక చాలా సురక్షితమైంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీన్ని రోజూ తాగవచ్చు. ముఖ్యంగా కాఫీ, టీ అధికంగా తాగేవారు ఒక పూట వాటిని మానేసి అందుకు బదులుగా ఈ టీని సేవిస్తుండాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ టీని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో కొన్ని నీళ్లను పోసి బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో కాస్త అల్లం, మిరియాల పొడి వేయాలి. అందులోనే కాస్త రాక్ సాల్ట్‌ను కూడా కలపాలి. బాగా మరిగిన తరువాత వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా ఈ టీని తయారు చేసి రోజుకు ఒక్కసారి తాగినా చాలు, ఎంతో మేలు జరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో అన్ని ప్రాసెస్‌లు సజావుగా సాగుతాయి. శరీరంలోని పోషకాలు సరైన రీతిలో గ్రహించబడి, వ్యర్థ పదార్థాలు త్వరగా బయటకు పోతాయి. కానీ, జీర్ణ సమస్యల కారణంగా అలసట, బరువు పెరగడం, మానసిక అలసట వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ టీ ఆహారంతో పాటు ఒక ఆరోగ్య సాధనంగా పరిగణించాలి. ఆయుర్వేద టీలో ఉండే అల్లం, మిరియాలు, తేనె మొదలైనవి సహజ యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వైరస్‌లు, బ్యాక్టీరియా లాంటి హానికర కారకాలపై పోరాడతాయి. అదే విధంగా ఇది శ్వాసకోశాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది, గాయాలను త్వరగా మాన్పిస్తుంది.
Read also: Mango juice: ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మ్యాంగో జ్యూస్ హానికరం