టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) న్యూజిలాండ్ తో జరిగే T20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. కోలుకోవడానికి 3-4 వారాలు పడుతుందని సమాచారం. ఫిబ్రవరి 7న జరిగే T20 వరల్డ్ కప్ కల్లా తను ఫిట్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది. తిలక్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి!
Read Also: Ashes series: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం?
రాజ్‌కోట్‌లో విజయ్ హజారే ట్రోఫీ, మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి (అబ్డామినల్ పెయిన్) వచ్చింది. వెంటనే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి ‘టెస్టిక్యులర్ టోర్షన్’ (Testicular Torsion) అనే సమస్య ఉన్నట్లు గుర్తించి, వెంటనే శస్త్రచికిత్స అవసరమని సూచించారు.
బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతనికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది.ఈనెల 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దాదాపు దూరమయ్యాడు. గత ఏడాది కాలంగా టీ20ల్లో తిలక్ (Tilak Varma) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో అతను ఆడిన 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా మార్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: