हिन्दी | Epaper

Rohit Sharma: ‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

Anusha
Rohit Sharma: ‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

Rohit Sharma: గత రెండేళ్లుగా భారత క్రికెట్ సాధిస్తున్న అద్భుత విజయాలపై టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అటు మహిళల జట్టు, ఇటు పురుషుల జట్టు ప్రపంచ వేదికలపై కనబరుస్తున్న ప్రతిభను కొనియాడారు. భారత క్రికెట్ ప్రస్తుతం అత్యున్నత దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Dhoni Retirement: ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

Rohit Sharma: 'This is just the beginning'
Rohit Sharma: ‘This is just the beginning’

ముంబై నుంచి మెన్స్ టీ20 వరకు.. విజయాల పరంపర

మహిళల జట్టు ప్రపంచకప్‌ను నెగ్గడం, ఆ వెంటనే పురుషుల జట్టు కూడా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం భారత క్రీడా చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని రోహిత్ అభివర్ణించారు. “ఈ విజయాలు కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి భారత క్రికెట్ వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870