हिन्दी | Epaper

French: అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

Vanipushpa
French: అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

దౌత్యపరమైన చర్చలు, వ్యూహాత్మక ఒప్పందాలు ఒక ఎత్తయితే.. భారతీయుల మనసు గెలుచుకోవడం మరో ఎత్తు. మన దేశానికి వచ్చిన ఎంతో మంది ఇతర దేశాల నేతలు మన మనసు గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చంగా అలాంటి ప్రయత్నమే చేసి.. అందరి మనసు గెలుచుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Macron). ముఖ్యంగా తన మూడు రోజుల భారత పర్యటనను అత్యంత వినూత్నంగా, ఒక సినీ ఫక్కీలో ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పర్యటనలోని మధుర జ్ఞాపకాలను ఒక వీడియోగా మలిచి.. దానికి మన బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన దురంధర్ సినిమాలోని ఓ పాటు మ్యూజిక్ ట్రాక్‌ను వేశారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Raebareli School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

French: President Macron's 'Durandhar' steps
French: President Macron’s ‘Durandhar’ steps

వైరల్ అవుతున్న మెక్రాన్ వీడియో..

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియో 43 సెకన్ల నిడివి కల్గి ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఈ వీడియోకు నేపథ్యంగా హిందీ బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్‌లోని “నా దే దిల్ పరదేశీ ను” అనే పాపులర్ సాంగ్‌ను ఉపయోగించారు. ఈ వీడియోలో మెక్రాన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీలు, తనకు లభించిన ఘన స్వాగతం, ఆలయ సందర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూపించారు. అంతేకాకుండా ముంబయి వీధుల్లో ఆయన చేసిన జాగింగ్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియోతో పాటు “ధన్యవాదాలు భారత్” అంటూ ఆ ఆయన రాసిన నోట్ అందరినీ మరింతగా అలరిస్తోంది.

కేవలం వీడియోలతోనే కాకుండా మెక్రాన్ పర్యటన దౌత్యపరంగానూ అత్యంత విజయవంతమైంది. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న ఆయన.. భారత్‌తో ఉన్న సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు వ్యూహాత్మక రంగాల్లో కలిసి పని చేయడానికి రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ఆయన ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870