ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మళయాళ హిట్ చిత్రం ‘జింఖానా’ కూడా ఒకటి. ప్రేమలు హీరో నెస్లన్ నటించిన ఈ బాక్సింగ్ డ్రామా తెలుగు ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం.
కథ
కేరళ రాష్ట్రంలోని అల్లెపీ ప్రాంతానికి చెందిన జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత, పెద్దోడు, చిన్నోడు, సెహనావాస్ ఐదుగురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అల్లరి చిల్లరిగా ఉంటూ రేపటి గురించి బెంగ అనేది లేకుండా అనుక్షణం ఎంజాయ్ చేద్దాం అనే మూడ్‌లో ఉంటారు. అయితే అప్పటికే రాసిన ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో ఐదుగరిలో ఒక్కరు మాత్రమే ఫాస్ అయి నలుగురు ఫెయిల్ అవుతారు. అయినా వాళ్లు దాన్ని సెలబ్రేట్ చేసుకుని ఇకపై కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటారు. కానీ తాము ఏ పని చేయలేమని ఆఖరికి బాక్సింగ్ నేర్చుకుని టోర్నమెంట్స్ ఆడి కాలేజీలో పాస్ మార్కులతో బయట పడొచ్చని సమీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడమీలో ట్రైనింగ్ కోసం చేరుతారు. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగింది, డిస్ట్రిక్ లెవల్, స్టేట్ లెవల్ టోర్నమెంట్లలో పాల్గొన్నారా, విజయం సాధించారా చివరకు ఏమైందనేది కథ.

కథనం
అలెప్పి జింఖానా సినిమాలో పేరుకు హీరో నస్లైన్ అయినప్పటికీ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఆరేడుగురి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందరికీ సమాన స్రకీన్ స్పేస్ ఉంటుంది. నస్లైన్ తప్పితే అంతా మన తెలుగు వారికి పరిచయం లేని నటులే ఉన్నప్పటికీ ఎండింగ్ వరకు మనకు ఆ తేడా ఏ కోశానా అనిపించదు. అంతలా సినిమా ను తీర్చి దిద్దారు. సినిమా ఆరంభమే స్నేహితుల ఇంటర్ రిజల్ట్స్ నుంచి మొదలు మొదటి 20 నిమిషాలు వారి డైలీ రొటీన్ చూయించి, అక్కడి సన్నివేశాలు, లేటెస్ట్ ట్రెండింగ్ పంచులతో థియేటరంతా పగలబడి నవ్వేలా చేశారు. ముఖ్యంగా ఇటీవల ఫేమస్ అయి ట్రెండింగ్‌లో ఉన్న అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వద్ద జాతకం చూపించి చెప్పాలా అంటూ పలు ట్రెండీ డైలాగ్స్ వాడారంటే ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో కిక్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్, అమ్మాయిలకు సైట్ కొట్టే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఎక్కడా వల్గారిటీ, అసభ్యత, అశ్లీలతలకు తావీవకుండా పాత్రల మధ్య నుంచి సందర్భోచిత కామెడీని పుట్టించారు. ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ టోర్నమెంట్‌తోనే సాగుతుంది. స్నేహితులుగా నటించిన ఐదుగురు వారి వారి పాత్రల్లో ఫర్‌ఫెక్ట్ యాప్ట్ అయ్యారు. మొదటి 20 నిమిషాలు కామెడీతో ఆలరించగా చివరి 20 నిమిషాలు పంచ్ డైలాగులు, యాక్షన్‌సీన్లు, క్లైమాక్స్ హీరో ఇంట్లో సన్నివేశంతో సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు నవ్వు మొహంతో బయటకు వచ్చేలా చేశారు. ఇక సాంకేతిక పరంగా సనిమా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఉంది. కేరళ విలేజ్ అందాలను అక్కడక్కడ మంచిగా చూపించారు. ఈ సినిమాలో అలరించే పాటలు లేక పోయినప్పటికీ సంగీతం సినిమాకు ఆయువు పట్టు. బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.
Read Also: Dhanush: ఇడ్లీ కడై మూవీ షూటింగ్ పూర్తీ చేసిన ధనుష్