యూరప్‌లోని స్వీడన్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఉప్ప్సల నగరంలో మంగళవారం (ఏప్రిల్ 29) సామూహిక కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. నివేదికల ప్రకారం.. నగరం నడిబొడ్డున ఉన్న ఉక్సాల స్క్వేర్ సమీపంలో వాల్పుర్గిస్ స్ప్రింగ్ ఫెస్టివల్ నేపథ్యంలో పెద్దఎత్తున జనాలు వీధుల్లోకి వచ్చి ఉత్సాహంగా ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. అక్కడికి సమీపంలోని హెయిర్ సెలూన్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా పడగ వాతావరణం నెలకొన్న సమీపప్రాంతాలు ఒక్కసారిగా భీతావాహకంగా మారాయి. జనాలు భయంతో పరుగులు తీశారు. అనేక మందికి బెల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
కాల్పుల గురించి సమాచారం అందడంతో పోలీస్ ఎమర్జెన్సీ విభాగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నగరం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తు అధికారులు కాల్పులు జరిపిన నిందితుల జాను, దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఇంకా గుర్తించలేదు. కాగా ఈ ఏడాది స్వీడన్‌లో ఇలాంటి కాల్పులు జరపడం ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో ఒరెబ్రోలోని ఓ ఎడ్యుకేషన్ సెంటర్‌లో 35 ఏళ్ల వ్యక్తి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది విద్యార్ధులు, టీచర్లు మృతి చెందారు.
భయాందోళనలో ప్రజలు
తాజాగా మరోమారు స్వీడన్‌లో ఇదే మాదిరి సామూహిక కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.కాగా ఇటీవలి కాలంలో స్వీడన్ గన్ క్రైమ్‌లు పెరిగిపోతున్నాయి. దీంతో స్వీడన్ దేశంలో ప్రజా భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. మంగళవారం జరిగిన దాడి ముఠాలకు సంబంధించినదా లేదా ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్న దాడి చేశారా అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తే తుపాకితో కాల్పలు జరిపి, అనంతరం బైక్‌పై పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజా సంఘటన ఉప్సల నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచ దేశాల్లోనే శాంతి భద్రతలకు నిలయంగా పేరుగాంచిన స్వీడన్‌లో హింసాత్మక వరుస ఘటనలు చోటు చేసుకోవడం చర్చణీయాంశంగా మారింది.
Read Also: Pakistan: కుప్పకూలిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ .. ప్రపంచ బ్యాంక్ సాయం