సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

Content Creators: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సహా అనేక ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ సృష్టించడాన్ని లక్షలాది మంది యువత ఇప్పుడు తమ కెరీర్‌గా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisements
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుంది
మార్కెట్లోని అనేక వ్యాపార సంస్థలు లేదా బ్రాండ్లకు సైతం వారు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రపంచ ఆడియో-విజువల్ అండ్ వినోద సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధిని ప్రకటించారు. ఈ నిధి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుందని తెలుస్తోంది.
ఉన్నత స్థాయి శిక్షణ
దీనితో పాటు రూ.391 కోట్ల వ్యయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని స్థాపించాలని నిర్ణయించబడింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఐఐటీ, ఐఐఎం తరహాలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక్కడ కంటెంట్ క్రియేషన్ అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన ఉన్నత స్థాయి శిక్షణ అందించబడుతుంది.

ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌
ఇదే క్రమంలో దేశంలో ఇన్ ఫ్లుయన్సర్ల వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధ చెందుతోందని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. దీని విలువ దాదాపు రూ.3375 కోట్లుగా ఉంది. దేశంలో 12 శాతం కంటెంట్ క్రియేటర్లు నెలకు రూ.లక్ష నుండి రూ.10 లక్షల మధ్య సంపాదిస్తున్నారని వెల్లడైంది. అలాగే 90 శాతం మంది రానున్న రెండేళ్లలో తమ ఆదాయం మరింతగా పెరుగుతోందని భావించటం గమనార్హం. ప్రభుత్వం వేవ్స్ బజార్ అనే ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. ఈ మార్కెట్‌ప్లేస్ భారతీయ తయారీదారులను అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానిస్తుంది.

Related Posts
pocso case : పోక్సో కేసు.. నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు
POCSO case.. Bombay High Court grants bail to accused

pocso case : బాంబే హైకోర్టు పోక్సో కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏకాభిప్రాయంతోనే సదరు బాలిక ఆ యువకుడితో వెళ్లిందని తెలుస్తోందని, ఏం Read more

Rahul Gandhi : ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi : రాజీపడిన ఎన్నికల సంఘం: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్రం ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు Read more

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ లకు నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ లకు నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ Read more

IPL 2025: అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించాం: శ్రేయస్ అయ్యర్
IPL 2025: అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించాం: శ్రేయస్ అయ్యర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×