हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

pocso case : పోక్సో కేసు.. నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు

sumalatha chinthakayala
pocso case : పోక్సో కేసు.. నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు

pocso case : బాంబే హైకోర్టు పోక్సో కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏకాభిప్రాయంతోనే సదరు బాలిక ఆ యువకుడితో వెళ్లిందని తెలుస్తోందని, ఏం చేస్తుందో ఆమెకు అవగాహన ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. 2020 ఆగస్టులో 15 ఏళ్ల బాలిక ఇంటినుంచి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగిరాలేదు. ఆమె ఒక యువకుడితో వెళ్లిపోయిందని అనుమానించిన తండ్రి.. నవీ ముంబయిలోని అతడి ఇంటికి వెళ్లి చూడగా, అక్కడా కనిపించలేదు. తర్వాత అతడికి ఫోన్ చేసి కుమార్తె గురించి ఆరాతీయగా తన వద్ద లేదని సమాధానం ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత ఆ బాలికనే తండ్రికి ఫోన్‌ చేసి, తాను ఆ యువకుడితోనే ఉన్నానని చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అతడి గ్రామంలో ఉన్నామని సమాచారం ఇచ్చింది. పది నెలల తర్వాత తిరిగి ఫోన్‌ చేసి తాను గర్భం దాల్చానని, అయితే ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని చెప్పింది.

పోక్సో కేసు  నిందితుడికి బాంబే

తమ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిపింది

తర్వాత బాలిక అభ్యర్థన మేరకు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 నుంచి ఆ యువకుడితో పరిచయం ఉందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. అతడు ప్రేమిస్తున్నానని చెప్పడంతో తాను కూడా అంగీకరించానని చెప్పింది. తమ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిపింది. 2020లో అతడు తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని, తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన గ్రామానికి తీసుకెళ్లాడని వెల్లడించింది. అక్కడ తామిద్దరం కలిసే జీవించామని చెప్పింది. దాంతో పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదైంది. కొంతకాలంగా అతడు జైల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడి బెయిల్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.

ఆమె వయసు 18 ఏళ్ల లోపే

ఈ వ్యవహారమంతా జరిగిన సమయంలో బాలిక మైనర్ అని, ఆమె అంగీకారమనేదని అసలు పాయింటే కాదని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న బాంబే హైకోర్టు ధర్మాసనం.. ఏకాభిప్రాయంతోనే సదరు బాలిక ఆ యువకుడితో వెళ్లినట్లు ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది. తాను ఏం చేస్తుందో ఆమెకు అవగాహన ఉంది. 10 నెలలు అతడితో కలిసి ఉంది. ఆమె వయసు 18 ఏళ్ల లోపే అయినా.. తన చర్యలు, నిర్ణయాలపై ఆమె స్పష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాను గ్రామంలో ఉన్నానని తల్లిదండ్రులకు ఆ బాలిక సమాచారం ఇచ్చినప్పటికీ.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని వ్యాఖ్యానించింది. తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870