సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

Content Creators: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సహా అనేక ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ సృష్టించడాన్ని లక్షలాది మంది యువత ఇప్పుడు తమ కెరీర్‌గా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisements
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుంది
మార్కెట్లోని అనేక వ్యాపార సంస్థలు లేదా బ్రాండ్లకు సైతం వారు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రపంచ ఆడియో-విజువల్ అండ్ వినోద సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధిని ప్రకటించారు. ఈ నిధి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుందని తెలుస్తోంది.
ఉన్నత స్థాయి శిక్షణ
దీనితో పాటు రూ.391 కోట్ల వ్యయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని స్థాపించాలని నిర్ణయించబడింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఐఐటీ, ఐఐఎం తరహాలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక్కడ కంటెంట్ క్రియేషన్ అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన ఉన్నత స్థాయి శిక్షణ అందించబడుతుంది.

ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌
ఇదే క్రమంలో దేశంలో ఇన్ ఫ్లుయన్సర్ల వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధ చెందుతోందని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. దీని విలువ దాదాపు రూ.3375 కోట్లుగా ఉంది. దేశంలో 12 శాతం కంటెంట్ క్రియేటర్లు నెలకు రూ.లక్ష నుండి రూ.10 లక్షల మధ్య సంపాదిస్తున్నారని వెల్లడైంది. అలాగే 90 శాతం మంది రానున్న రెండేళ్లలో తమ ఆదాయం మరింతగా పెరుగుతోందని భావించటం గమనార్హం. ప్రభుత్వం వేవ్స్ బజార్ అనే ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. ఈ మార్కెట్‌ప్లేస్ భారతీయ తయారీదారులను అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానిస్తుంది.

Related Posts
ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు
ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఈ మధ్యకాలంలో ఎంతో మందిని కబళిస్తున్న ఒక ప్రమాదకర వ్యసనం. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో, ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్, Read more

IPL 2025: ఐపీఎల్ ఆటగాళ్లకి పన్ను చిక్కులు: చేతికి వచ్చేది ఎంత!
ఐపీఎల్ ఆటగాళ్లకి పన్ను చిక్కులు: చేతికి వచ్చేది ఎంత!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ తాజాగా ప్రారంభమైన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈసారి ఊహించని విధంగా IPL ప్లేయర్స్ వేలం కోట్లలో Read more

Judges:జడ్జిలు తప్పు చేస్తే వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..!
Judges:జడ్జిలు తప్పు చేస్తే వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..!

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల కలకలం. ఆయన నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం కొత్త వివాదాలకు తెరలేపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టపై దెబ్బ పడిందని, Read more

గర్భాన్ని తొలగించుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు
గర్భాన్ని తొలగించుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు

లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×