ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

తమిళ హీరో అజిత్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌ కాగా అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తమిళంలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అజిత్ యాక్షన్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్‌కి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.సంగీత దర్శకుడు ఇళయరాజా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించడం కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో తన పాటలను అనుమతి తీసుకోకుండా వాడుకున్నందుకు రూ.5కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో ఇళయరాజా డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వని పక్షంలో ఈ సినిమాలో తన పాటలను తొలగించడంతో పాటు నిర్మాతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన నోటీసులపై ఏడు రోజుల్లోగా స్పందించకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisements

పర్మిషన్‌

ఈ నేపథ్యంలో ఇళయరాజా పంపిన లీగల్‌ నోటీసులపై నిర్మాణ సంస్థ తాజాగా స్పందించింది.ఆయా పాటలను వినియోగించే ముందు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ తీసుకున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్‌ తెలిపారు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో ఉపయోగించిన అన్ని పాటలకు మ్యూజిక్‌ కంపెనీల నుంచి పర్మిషన్‌ తీసుకున్నాం. ఈ విషయంలో ప్రొటోకాల్‌ ఫాలో అయ్యాము. చట్టప్రకారమే పనులు చేశాము’ అని తెలిపారు.

ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

సోషల్‌మీడియా

‘నట్టుపుర పట్టు’ లోని “ఓథా రూబైయుమ్ తారేయిన్”, ‘విక్రమ్’ లోని “ఎన్ జోడి మంజల్ కురివి”, ‘సకల కళా వల్లవన్’ లోని “ఇలమై ఇధో ఇధో” వంటి పాటలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇవన్నీ ఇళయరాజా స్వరపరిచిన పాటలే. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు ఆగ్రహించిన ఆయన నిర్మాతలకు గట్టి షాకిచ్చారు. ఇళయరాజా గతేడాది మలయాళంలో వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకి కూడా ఇలాగే లీగల్ నోటీసులు పంపారు.మరోవైపు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఇతర భాషల్లో నిరాశ పరిచినా తమిళంలో మాత్రం దూసుకుపోతోంది. తొలి వారంలోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అజిత్‌కి మంచి హిట్ అందించింది. 

Read Also: Vijaya Shanthi: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్ స్పందించిన విజ‌య‌శాంతి

Related Posts
ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర
ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు మహారాష్ట్ర

ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర లో ఔరంగజేబ్ సమాధి తొలగించాలన్న డిమాండ్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శంభాజీనగర్ Read more

Mayawati: కులగణనపై మాయావతి కీలక ప్రకటన
Mayawati: కులగణనపై మాయావతి కీలక ప్రకటన

మాయావతి కులగణనపై డిమాండ్ – కేంద్రాన్ని కోరిన బీఎస్పీ అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని Read more

కేజ్రీవాల్‌పై మోదీ విమర్శలు
కేజ్రీవాల్ పై మోదీ విమర్శలు

తన కోసం 'షీష్ మహల్' నిర్మించుకోవడానికి బదులు ప్రజలకు శాశ్వత నివాసం కల్పించడమే తన కల అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముఖ్యమంత్రి నివాసం యొక్క Read more

నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
CM Revanth Reddy meet the Prime Minister today

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30కు ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో ఆయన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×