हिन्दी | Epaper

Gamblers Movie: గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ విడుదల

Anusha
Gamblers Movie: గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ యువనటుడు సంగీత్ శోభ‌న్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అయితే యూత్‌ఫుల్‌ క్రేజీ హీరోగా మారకముందు ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు ‘గ్యాంబ్లర్స్‌’. ఇన్నాళ్లూ విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల ముందే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం టీజర్, ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు. తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.”ఆడటం చేతగాని వాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది,ఆడటం తెలిసిన వాడికి జూదం నేరం కాదు” అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్(Trailer) లో ఒక క్లబ్ లో జరిగే సన్నివేశాలను చూపించారు. కొందరు వ్యక్తులు క్లబ్ లో గేమ్ ఆడటం, హీరో వాళ్ళతో ఏదో డీల్ సెట్ చేసుకోవడం, దాని వెనుక ఇంకేదో మిస్టరీ ఉందని అనుకునేలా ఈ ట్రైలర్ ను కట్ చేసారు. మిస్టరీతో పాటుగా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉందని తెలియజెప్పారు. ట్రైలర్ లో సంగీత్‌ శోభన్‌ షాట్స్ ఎక్కువ కట్ చేసినప్పటికీ, అతనితో పాటుగా మరికొందరు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించినట్లుగా తెలుస్తోంది.

ఆశాభావం

మ్యాడ్‌’, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాల్లో నవ్వులు పూయించిన సంగీత్‌ శోభన్(Sangeet Shobhan) ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించారు. కౌబాయ్ తరహా కాస్ట్యూమ్స్ లో ఆకట్టుకున్నారు. ప్రశాంతి చారులింగా, రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.’గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్ కొత్తగా ఏమీ లేదు. కానీ సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని మేకర్స్(Makers) చెబుతున్నారు. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంగీత్‌ శోభన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు.

వైవిధ్యమైన

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(Snap and Clap Entertainment) పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌గా, ఈ చిత్రం చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 6న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read Also: Opal Suchata: ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం: మిస్​ వరల్డ్ సుచాత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870