हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ బ్యాంకులకు కేంద్ర ఆర్దిక మంత్రి కీలక ఆదేశాలు

Anusha
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ బ్యాంకులకు కేంద్ర ఆర్దిక మంత్రి కీలక ఆదేశాలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దేశప్రజలంతా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ నగదు నిల్వల పైన కేంద్రం అప్రమత్తం అయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) నిర్దేశించారు. వినియోగదారులకు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసారు.భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు ల కు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను నిర్మలా ఆదేశించారు. సైబర్‌ భద్రత సన్నద్ధతపై ఆర్​బీఐ, బ్యాంకులు ఎన్‌పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధరించడంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌(Banking, Finanace) రంగాల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో నగదు లావా దేవీలు విత్ డ్రాల పైన జరుగుతన్న ప్రచారాన్ని ఖండిస్తూ వినియోగదారులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Capture
బ్యాంకులకు కేంద్ర ఆర్దిక మంత్రి

ఆర్థిక స్థిరత

ఈ సమావేశం ద్వారా బ్యాంక్​కార్యాలయాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని చెప్పిన నిర్మలా డిజిటల్‌ విధానంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఏటీఎంలలో సరిపడా నగదును అందుబాటులో ఉంచాలన్నారు. యూపీఐ సర్వీసులు సజావుగా సాగేలా జాగ్రత్త వహించాలని.ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కోసం చొరవ చూపాలని సూచించారు. ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో కచ్చితంగా సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకుల ప్రతినిధులను ఆదేశించారు.ఈమేరకు అన్ని బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా వ్యవస్థను నడిపించాలంటూ ఆదేశించారు.ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థిరతను కాపాడటమే కాకుండా, సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని ఆమె వివరించారు.

Read Also : Balochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870