हिन्दी | Epaper

Visakhapatnam: చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే ప్రాణాలనే మింగేసిన నకిలీ వైద్యుడు

Anusha
Visakhapatnam: చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే ప్రాణాలనే మింగేసిన నకిలీ వైద్యుడు

ఇంట్లో జారిపడి చెయ్యి విరిగిందని ఆస్పత్రికి వెళితే ఏకంగా ప్రాణాలే పోయాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరుకు చెందిన రేవతికి జనార్దన్‌తో వివాహమైంది. ఆయన చిప్పాడ దివీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారికి నాలుగేళ్లు, తొమ్మిది నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే జనార్దన్(Janardhan) ఉద్యోగ నిమిత్తం ఈ కుటుంబం మొత్తం విశాఖపట్నం తగరపువలస సమీపంలోని జీరుపేటలో నివాసం ఉంటున్నారు. ఆమె ఈనెల 6న బాత్‌రూంలో కాలు జారి పడిపోయారు. ఆమె కుడి చేయి విరగడంతో కుటుంబసభ్యులు సంగివలసలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సర్జరీ చేసేందుకు బీమా (ఇన్స్యూరెన్స్) అనుమతులు రావాలని డాక్టర్లు చెప్పారు. అనుమతులు వచ్చాక సర్జరీ చేస్తామని తెలిపారు.ఈనెల 8న సాయంత్రానికి అనుమతి రావడంతో ఈ 9వ తేదీ ఉదయం సర్జరీకి ఏర్పాట్లు చేశారు.

  Visakhapatnam: చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే ప్రాణాలనే మింగేసిన నకిలీ వైద్యుడు

ఆందోళన

రేవతికి సర్జరీకి ముందు నొప్పి తెలియకుండా డాక్టర్లు మత్తు మందు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె భర్త జనార్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవతిని మెరుగైన వైద్యం కోసం ఆ ఆస్పత్రి నుంచినగరంలోని వేరే ఆసుపత్రిలో ఈనెల 10న చేర్పించారు. అయితే రేవతి పరిస్థితి రోజురోజుకీ విషమించడంతో బుధవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం కేజీహెచ్‌(KGH)కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రేవతి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం జరిగే వరకూ పోస్ట్‌మార్టమ్‌(Postmortem)కు సహకరించేది లేదని మృతురాలి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.వారంతా ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.వారు మాత్రం ఆందోళన విరమించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Andhra Pradesh: ఆంధ్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870