Bigg Boss 10: ఐదో వారం నామినేషన్ల వేడి.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?

Follow Us: Google News Daily Hunt
Bigg Boss 10
Bigg Boss 10
FONT SIZE
GET APP

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వారానికి సంబంధించిన నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం.. త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్ మరియు రామ్ ప్రసాద్ ఈ ఐదో వారంలో నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాల ఆధారంగా ఈ వారం ఎలిమినేషన్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Read Also : Srishti Vyakaranam: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్

Bigg Boss 10
The heat of the fifth-week nominations… Who is in the danger zone?

Bigg Boss 10: షాలినీ ఆట తీరుపై ప్రేక్షకుల తీవ్ర అసంతృప్తి

గత వారమే ఎలిమినేషన్ అంచు వరకు వెళ్లిన షాలినీ, చివరి క్షణంలో శ్రిష్టికంటే సేవ్ అయి హౌస్‌లో నిలిచింది. అయితే, శ్రిష్టి కంటే షాలినీని ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. షాలినీలాగా శ్రిష్టి ఫేక్ లవ్ ట్రాక్‌లు నడపదని, ఊరికే ఇతరులపై పడి అరవదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్‌తో కలిసి ఫేక్ లవ్ స్టోరీ నడుపుతూ, అతని ఆటకు కూడా అడ్డుపడుతోందని రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం కూడా తన ప్రవర్తన మార్చుకోకపోతే రోహిత్ అభిమానులే షాలినీని బయటకు పంపించే అవకాశం ఉంది.

మరోవైపు ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వకుండా చరణ్ ప్రతివారం ఎలా సేవ్ అవుతున్నాడనేది బిగ్ బాస్ వీక్షకులకు పెద్ద సందేహంగా మారింది. బయట ఏమైనా ఆర్గనైజ్డ్‌గా ఓట్లు వేయించుకుంటున్నాడా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోస్ట్ నాగార్జున కూడా “నీకు ఆటకు సంబంధం లేదు.. వారానికి ఒకసారి వస్తావ్.. వెళ్తావ్” అని సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా సైలెంట్‌గా ఉంటే చరణ్‌కు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ కార్డ్ తప్పదు.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అపూర్వ రాకతో ఆట మారుతుందని భావించినా, గొడవల తప్ప ఆమె నుంచి పెద్దగా వినోదం రావడం లేదు. అపూర్వ, అమన్ ఆటపై జనాలు ఆసక్తి చూపడం లేదు. ఇక త్రిగుణ్, రోహిత్ టాప్ 5కి వెళ్లే సత్తా ఉన్న కంటెస్టెంట్లు కావడంతో వారు ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. రామ్ ప్రసాద్ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. మొత్తానికి విశ్లేషిస్తే.. అమన్, షాలినీ మరియు చరణ్ ఈ ముగ్గురు ప్రస్తుతం తీవ్రమైన డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలోనే ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు