Bigg Boss 10 Telugu: ఫ్యామిలీ కోసం ఫైట్.. మొదటి టాస్కులోనే సంచాలకుల మధ్య గొడవ!

Follow Us: Google News Daily Hunt
In the promo for Day 59 of Bigg Boss Telugu 10, the family task unfolded in an engaging manner. While Aman completed the task quickly, an argument broke out between the task adjudicators, Trigun and Mukesh.
In the promo for Day 59 of Bigg Boss Telugu 10, the family task unfolded in an engaging manner. While Aman completed the task quickly, an argument broke out between the task adjudicators, Trigun and Mukesh.
FONT SIZE
GET APP

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ‘రివార్డ్స్ అండ్ రివేంజ్’ అనే థీమ్‌తో కంటెస్టెంట్లకు కొత్త టాస్కులు ఇస్తున్నారు. పదో వారంలో ఫ్యామిలీ వీక్ ఉండనుండగా.. ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఈ వారం ఆటల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మొదటి ఛాలెంజ్‌ను ప్రారంభించాడు.

Read Also :Bigg Boss 10: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ మంటలు.. వంశీ మాటలపై వర్షిణి ఫైర్!

ఫ్యామిలీ కోసం తొలి ఛాలెంజ్

Bigg Boss 10 Telugu

ఈ టాస్కుకు త్రిగుణ్, ముకేష్‌లను సంచాలకులుగా నియమించాడు బిగ్ బాస్. ఇందులో ఒకవైపు కట్టి ఉంచిన బంతులను విడదీసి తీసుకెళ్లాలి. ఆ తర్వాత ఒక కంటెస్టెంట్ మరొకరిని భుజాలపై మోస్తూ, ఆ బంతులను ఉపయోగించి పైన ఉంచిన బుట్టను కింద పడేయాలి. ఈ ఛాలెంజ్‌ను ముందుగా పూర్తి చేసిన టీమ్ విజేతగా నిలుస్తుంది. ఈ ఆటలో సుధీర్.. నరేష్‌ను తన భుజాలపై ఎక్కించుకోగా, ఆర్కే.. అమన్‌ను మోశాడు. అయితే నరేష్ కంటే వేగంగా అమన్ టాస్కును పూర్తి చేసినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో రెడ్ టీమ్ విజయం సాధించినట్లు అనిపిస్తోంది. కానీ అసలు విజేత ఎవరో ఎపిసోడ్‌లోనే తేలనుంది.

సంచాలకుల మధ్య వాగ్వాదం

టాస్కు ముగిసిన తర్వాత బంతిని పూర్తిగా విప్పి తీసుకురాలేదని త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే శివ్, ముకేష్ మాత్రం తమ టీమ్ నిబంధనల ప్రకారమే ఆడిందని వాదించారు. ఈ క్రమంలో ముకేష్ మరో సంచాలకుడైన త్రిగుణ్ అభిప్రాయంతో ఏకీభవించకుండా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఇద్దరు సంచాలకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీనిపై బిగ్ బాస్ కూడా స్పందించాడు. సంచాలకులు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రాకపోతే దాని పర్యవసానాలను రెండు టీమ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీంతో ఇంటి సభ్యులందరికీ పనిష్మెంట్ పడుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

Bigg Boss 10 Telugu: ఈ వారం నామినేషన్లలో ఎవరు?

మరోవైపు ఈ వారం నామినేషన్లలో దాదాపు ఇంటి సభ్యులందరూ ఉన్నట్లు సమాచారం. ఆర్కే, శ్వేత, కెప్టెన్ త్రిగుణ్ మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ముకేష్ గ్యాంగ్ నుంచి ఈ వారం ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా వర్షిణి, సుధీర్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. గత రెండు వారాల్లో డబుల్ ఎలిమినేషన్లు జరగగా.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వారం ఎవరి ఆట మెరుగుపడుతుంది? ఎవరు ఫ్యామిలీ వీక్‌కు అర్హత సాధిస్తారు? ఎలిమినేషన్‌లో ఎవరు బయటకు వెళ్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు