Sudheer Reddy: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. దశావతారం థీమ్‌తో ఘనంగా ప్రారంభమైన ఈ షో, ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్ల హీట్‌తో హౌస్‌లో వాతావరణం వేడెక్కగా, మరోవైపు కంటెస్టెంట్లు తమ గత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంటూ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నారు.

ప్రత్యేక టాస్క్‌లో కంటెస్టెంట్ల భావోద్వేగాలు – సుధీర్ రెడ్డి ఎమోషనల్
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యుల ఫొటోలను చూపిస్తూ అనుబంధాలను గుర్తుచేసే ఒక ప్రత్యేక భావోద్వేగ టాస్క్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఫొటోను చూసిన కంటెస్టెంట్ సుధీర్ రెడ్డి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఎదురైన మానసిక సంఘర్షణలు, వైవాహిక బంధంలోని ఇబ్బందికర పరిస్థితులను తలుచుకుని కంటతడి పెట్టుకున్నారు. తోటి పోటీదారులు ఆయనను ఓదార్చడం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
Read also: Ramayana Movie: ‘రామాయణ’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు
Sudheer Reddy: పెళ్లి తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి: సుధీర్ రెడ్డి
తన జీవితంలోని కీలక విషయాలను పంచుకుంటూ సుధీర్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పెళ్లి తర్వాతే తన జీవితంలో అసలు సమస్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తాను మనుషులను అతిగా నమ్ముతానని, అదే తన అతిపెద్ద బలహీనత అని వాపోయారు. పెళ్లికి ముందే ఇల్లు కొనుగోలు చేయడం, అదే సమయంలో వివాహ ఏర్పాట్లు జరగడంతో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆ సమయంలో హోమ్ లోన్ ప్రక్రియలు, పెళ్లి ఖర్చుల వల్ల తల్లిదండ్రులు పడిన ఇబ్బందులు తనను ఎంతగానో కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భార్య మాటలతో కుంగిపోయాను – ఒంటరి ప్రయాణంపై ఆవేదన
పెళ్లి తర్వాత జీవితం తాను ఆశించిన విధంగా సాగలేదని సుధీర్ ఎమోషనల్ అయ్యారు. ఇతరులతో తనను పోల్చి అవమానించే మాటలు వినాల్సి వచ్చిందని, “నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నా జీవితం నాశనమైంది” అంటూ భార్య అన్న మాటలు తన గుండెను పిండేసాయాని కన్నీరు పెట్టుకున్నారు. మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోగా, త్వరలోనే తిరిగి వస్తుందని ఎంతో ఆశపడ్డానని, కానీ చివరికి ఆమె అమెరికా వెళ్లిపోవడంతో పూర్తిగా ఒంటరినైపోయానని మానసికంగా ఎంతో కుంగిపోయానని తెలిపారు.
కష్టాల్లోనూ మానవత్వం చాటుకున్న సుధీర్ రెడ్డి
తన జీవితం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, తోటివారికి సాయం చేయడంలో మాత్రం తాను ఎప్పుడూ వెనుకాడలేదని సుధీర్ స్పష్టం చేశారు. ఓ నిరుపేద మహిళ కుమార్తెల చదువు కోసం ఏడాది పాటు స్కూల్ ఫీజులు చెల్లించానని, వైజాగ్‌లో ఒక వృద్ధురాలికి బాసటగా నిలిచానని చెప్పారు. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తికి కేవలం 24 గంటల వ్యవధిలోనే రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న సుధీర్ జీవిత ప్రయాణం ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :