The ova : అండ పిండ బ్రహ్మండాల కలయిక మానవ దేహం. దేహ ఆరోగ్యం సందేహాస్పదమైనపుడు దేహం లోని ఏ అవయవాన్నయినా దానం ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిది పెద్ద మనసుగా చెప్పుకోవచ్చు. కానీ పేదరికాన్ని ఆసరాగా తీసుకుని స్త్రీ మూర్తుల దేహాంత భాగమైన అండాలను అమ్ముకోవలసిన దుస్థితి రావడమే దుర్భరం. వాటి మీద కూడా వ్యాపారం చేయ డం దుర్మార్గం అనే చెప్పాలి. అలాంటి దుర్దశకు ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు ప్రధాన కేంద్రాలయ్యాయి. మానవ పునరుత్పత్తి వ్యవస్థను వ్యాపార వస్తువుగా మార్చుతున్న మాఫియా ఒకటి ఇప్పుడు గుట్టు రట్టయ్యింది. సంతానో త్పత్తికి ఉపయోగపడాల్సిన జీవకణాలు మహిళల ఓవరీలు, పురుషుల స్పెర్ట్ను అక్రమ వ్యాపారానికి సాధనాలుగా మారుస్తున్న ముఠా అది. హైదరాబాద్లో తాజాగా వెలుగులోకి వచ్చిన అక్రమ అండాల సేకరణ, పురుషుల వీర్యకణాల అక్రమ విక్రయ వ్యవహారం కేవలం పోలీసు కేసుగా చూడాల్సిన అంశం కాదు. ఇది మహిళల శారీరక స్వేచ్ఛ, ఆరోగ్య భద్రత, పేదరికం, వైద్యరంగ నైతికత, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థల పనితీరుకు సంబంధించిన తీవ్రమైన సామాజిక సమస్యగా కనబడుతోంది. 2026 అక్టోబరు 30,31 తేదీల్లో హైదరా బాద్ లోని బేగంపేట, ప్రకాశ్నగర్, ఎర్రగడ్డ, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన పోలీసు దాడుల్లో 43 మంది మహిళలను రక్షించి, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు వెలువడిన వార్తా కథనాలు ఆందోళన కలిగిస్తు న్నాయి.
Read Also : Rajasthan Electric Shock Accident:ఘోర ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి 8 మంది మృతి

The ova : వైద్య పర్యవేక్షణ లోపాలపై అనుమానాలు
వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి, ఒక్కో అండదాన చక్రానికి రూ.20 వేలు నుంచి రూ.30 వేలు వరకు చెల్లిస్తామని ఆశ చూపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ఐవిఎఫ్ వంటి ఆధునిక వైద్య విధానాలు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. అండాలు, వీర్యకణాల దానం ద్వారా అనేక కుటుంబాలకు సంతానం కలిగే అవకాశం ఏర్పడుతోంది. అయితే ఈ వైద్య అవసరాన్ని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు, ఏజ ంట్లు, అక్రమ నిర్వాహకులు డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తే అది వైద్య సేవ కాదు. మానవ శరీర భాగాల దుర్వినియోగం. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న మహిళలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, హాస్టళ్లలో ఉంచి, హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాల సేకరణ ప్రక్రి యకు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళన కరం. మహిళలను ఇతర రాష్ట్రాల నుంచి గుర్తించి హైదరాబాద్కు తీసుకురావడం, ప్రయాణం, వసతి, వైద్య కేంద్రాలతో సంబంధాలు ఏర్పాటు చేయడం వంటి పను లకు ప్రత్యేక ఏజెంట్లు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలకు ఆర్ధిక లబ్ధి కలిగిస్తామని ఆశ పెట్టి జీవ కణాలు విక్రయాలకు పురికొల్పడం మంచి పద్దతి కాదు. హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు, వైద్య సామగ్రి స్వాధీనం కావడం, అనధికార వైద్య పర్యవేక్షణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో వైద్య పర్యవేక్షణ లోపాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
జీవకణాల సృష్టిని ఒక మార్కెట్ సరుకుగా మార్చేయడం
హైదరాబాద్లోని సుమారు 23 ఐవీఎఫ్ కేంద్రాలతో సంబంధాలు ఉన్నాయనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్లు అనుమానాలుంటే సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు? అనేది ఆలోచించవలసి ఉంది. 2025లో హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. 2026 జూన్లో మహారాష్ట్రలో ఒక మహిళ పలుమార్లు అండదానం చేసినట్లు ఆరోపణలు వచ్చిన మరో అక్రమ ఫెర్టిలిటీ నెట్వర్క్ ప్రచురించింది. ఒక మహిళ 45 సార్లు అండదానం చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఈ రంగంలో పర్యవేక్షణ ఎంత కీలకమో తెలియజేస్తున్నాయి. సంస్కృతి, నైతిక విలువలు ఉన్న మన సమాజంలో జీవకణాల సృష్టిని ఒక మార్కెట్ సరుకుగా మార్చేయడం అత్యంత దిగ్భ్రా Oతికరమైన విషయం, సంతానలేమితో బాధపడు తున్న దంపతుల బలహీనతలను, ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, యువకులు పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ ద శారీ ముఠాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. అండాల సేకరణ కోసం మహిళలకు పరిమితికి మించిన హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల వారి ప్రాణాలకే ప్రమా దం వాటిల్లుతోంది.

నైతిక విలువలు కనుమరుగై,
భారత ప్రభుత్వం తెచ్చిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ నియంత్రణ చట్టం 2021, సరోగసీ నియంత్రణ చట్టం ప్రకారం వాణిజ్యపరమైన అండాలు, వీర్యకణాల విక్రయం తీవ్రమైన నేరం. ఉన్నత చట్టాలు ఉన్నప్పటికీ, ఏజెంట్లు ఐవీఎఫ్ సెంటర్లు, ఏఆర్టీ బ్యాం కుల యాజమాన్యాలతో చేతులు కలిపి దొడ్డిదారిన వ్యాపా రం నడుపుతున్నారు. పేద ప్రాంతాల నుండి మహిళ లను అధిక డబ్బు ఎరగా చూపి ఒకే చోట బంధించి, పదే పదే వారి శరీరం నుండి అండాలు సేకరిస్తున్నారు. ఇది ఆధునిక కాలపు వ్యాపారం, లేదా మానవ అక్రమ రవాణా కన్నా తక్కువేమీ కాదు. జీవాన్ని సృష్టించే జీవకణాలను బజారులో కూరగాయల తరహాలో విక్రయించడం మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘన. వైద్య వృత్తిలో ఉండాల్సిన నైతిక విలువలు కనుమరుగై, కేవలం లాభాపేక్ష మాత్రమే ధ్యేయంగా కొందరు వైద్యులు, బయో బ్యాంకుల నిర్వా హకులు వ్యవహరించడం శోచనీయం.. ముఖ్యంగా ఆర్థి కంగా వెనుకబడిన మహిళల్లో తమ శరీరాలను ఇటువంటి అక్రమ ప్రక్రియలకు గురిచేస్తే వచ్చే క్యాన్సర్, మాతృత్వ లోపం, ప్రాణాపాయాల గురించి ఆరోగ్య కార్యకర్తలు ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇలాంటి ఉచ్చులో పడకుండా మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, ఆర్ధిక స్వావలంబన కల్పించాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: