Judiciary : భారత న్యాయవ్యవస్థ ముందు పెండింగ్ కేసుల సమస్య అతిపెద్ద సవాలుగా మారింది. న్యాయం వేగంగా అందినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడు తుంది. న్యాయ వ్యవస్థపై రోజురోజుకూ పెరుగుతున్న భారంతో కేసుల పెండింగ్ ఆందోళనకర స్థాయికి చేరు కుంది. జాతీయ న్యాయ డేటా గ్రిడ్ ప్రకారం దేశవ్యా ప్తంగా సుప్రీంకోర్టు, దేశంలోని 25 హైకోర్టులు, జిల్లా/ అనుబంధ కోర్టులలో కలిపి జిల్లా, అనుబంధ కోర్టుల్లోనే దాదాపు 5.64 కోట్ల పెండింగ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా లక్షల సంఖ్య లో కేసులు విచారణ కోసం ఎదురుచూస్తున్నాయని నేష నల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ పేర్కొంది. కేంద్రప్రభుత్వం పార్ల మెంట్కు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం ప్రస్తు తం సుప్రీంకోర్టులో దశాబ్ద కాలం నాటి 10 వేలకుపైగా కేసులు, మూడు దశాబ్దాలకు చెందిన 80,660 కేసులు 7 హైకోర్టులలో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. సుప్రీం కోర్టులో 96వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. అలాగే, 558 కేసులు 20 యేళ్లకు పైగా పెండింగ్లో ఉండగా, అత్యున్నత న్యాయస్థానంలో 26 కేసులు 30 యేళ్లకు పైగా పరిష్కారం కాలేదని ఆయన వివరించారు. ఇది న్యాయవ్యవస్థలో పెండింగ్లో ఉన్న కేసుల తీవ్రతను తెలియజేస్తోంది.
Read Also : Riley Moore: భారత చట్టంపై అమెరికా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Judiciary : న్యాయ రంగాల్లోనూ సంస్కరణలు
అన్ని రంగాల్లోనూ సంస్కరణలు జరుగుతున్నట్లు ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైన న్యాయ రంగాల్లోనూ సంస్కరణలు జరు గుతున్నా అవి ప్రజలకు చేరడంలోనూ ఎంతో జాప్యం అవుతోంది. జాప్యానికి కారణాలేమిటంటే కేసుల సంక్లి ష్టత, సమర్థ పరిష్కారం ఆధారపడి ఉంటుందనిమేఘ్వాల్ అన్నారు. హైకోర్టులు, దిగువ న్యాయవ్యవస్థలో ఖాళీలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తులు, న్యాయాధికారు లు, సహాయక సిబ్బంది లభ్యతతో సహా, తగినంత న్యాయ సిబ్బంది, మౌలిక సదుపాయాలపై కూడా కేసుల కాల పరిష్కారం ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది. భారతీయ కోర్టులలో పెరుగుతున్న ఖాళీల కారణంగానే పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నా యని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లు 2026కు లోక్ సభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 385 పెంచేందుకు ఈ బిల్లును రూపొందించి తగినంత మంది కోర్టు సిబ్బంది, మౌలిక సదుపాయాల లభ్యతపై కూడా కేసుల సకాల పరిష్కారం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం 25 హైకోర్టులలో మంజూరైన 1,122 మంది న్యాయమూర్తులకు గాను 341 న్యాయమూర్తుల ఖాళీలు ఉండగా, దిగువ న్యాయ మూర్తులకు 7,311 ఖాళీలు కోర్టులలో మంజూరైన 30,868 మంది ఉన్నాయి. కేసుల పరిష్కార, వేగం ఖాళీలు కార్యాచరణ, విధానపరమైన అంశాలచే ప్రభావి తమవుతుందని, కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతిపౌరుడికి హామీ ఇచ్చిన ‘సకాలం లో న్యాయం’ అనే ప్రాథమిక విలువను సాకారం చేయా ల్సిన జాతీయ కర్తవ్యం.
ప్రభుత్వశాఖలే అత్యధికంగా దావాలు వేయడం
పెండింగ్ కేసులకు అనేక కార ణాలున్నాయి. న్యాయమూర్తుల ఖాళీలు, కొత్త కోర్టుల కొరత, విచారణల్లో తరచూ వాయిదాలు, ప్రభుత్వశాఖలే అత్యధికంగా దావాలు వేయడం, దర్యాప్తు సంస్థల ఆల స్యం, సాక్షులు హాజరు కాకపోవడం, సాంకేతిక సిబ్బంది కొరత వంటి అంశాలు సమస్యను మరింత క్లిష్టం చేస్తు న్నాయి. ప్రతి కేసు వెనుక ఒక కుటుంబం, ఒక బాధి తుడు, ఒక వ్యాపారం లేదా ఒక పౌరుని హక్కు దాగి ఉంటుంది. న్యాయం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం కూడా పార్లమెంట్లో ఇదే కారణాలను ప్రస్తా వించింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కేసుల పెండింగ్ మరింత తీవ్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లక్షల నుంచి కోట్ల వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఐదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య కూడా గణనీయం గా ఉంది. అత్యంత ఆందోళనకర అంశం ఏమిటంటే, కొన్నికేసులు 20 నుంచి 30 సంవత్సరాలుగా కూడా తుది తీర్పు కోసం ఎదురుచూస్తు న్నాయి. ఇటీవల వెల్లడైన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 20సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 11లక్షలకు మించిపోయిం ది.

క్రిమినల్ కేనుల్లో ఆలస్యం
ఇది న్యాయవ్యవస్థ వేగంపై తీవ్రమైన ప్రశ్నలు లేవ నెత్తుతోంది. అయితే ఆశాజనక పరిణామాలు కూడా ఉ న్నాయి. న్యాయమూర్తుల నియామకాలను వేగవంతం చేయడం, ఖాళీలను భర్తీచేయడం, ప్రత్యామ్నాయవివాద పరిష్కార వ్యవస్థలు లోక్ఆదాలత్లను మరింత బలోపే తం చేయడం, ప్రభుత్వ వ్యాజ్యాలను తగ్గించడం, కేసుల నిర్వహణలో సమర్థత పెంచడం వంటి నిర్మాణాత్మక సం స్కరణలు అత్యవసరం. దర్యాప్తు సంస్థల ఆలస్యం, సాక్షు లు హాజరు కాకపోవడం, ఫోరెన్సిక్ నివేదికలు ఆలస్యం గా రావడం, మౌలిక వసతుల కొరత వంటి అంశాలు కూడా విచారణను నెమ్మదింపజేస్తున్నాయి. భూవివాదాలు పరిష్కారం కాక రైతులు, పెట్టుబడిదారులు నష్టపోతారు. వాణిజ్య కేసులు ఆలస్యమైతే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తాయి. క్రిమినల్ కేనుల్లో ఆలస్యం వల్ల బాధితులకు న్యాయం దూరమవుతుండగా, నిర్దోషులు కూడా సంవత్సరాల తరబడి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. జైళ్లలో విచారణ పూర్తికాకుండానే వేలాది మంది ఖైదీలు ఉండటం మరో పెద్ద సమస్య. ఇది మానవహక్కుల కోణంలో కూడా ఆందోళన కలిగించే అంశం. పెండింగ్ సమస్యను పరిష్కరించాలంటే తాత్కా లిక చర్యలు సరిపోవు. సమగ్ర సంస్కరణలు అవసరం. I
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: