Drug-Free India : నిన్నమొన్నటి వరకు అడవుల్లో నక్సలిజాన్ని అంతం చేసేంతవరకు నిద్రపోని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని భూ స్థాపితం చేసేందుకు కంకణం కట్టుకోవడం ఆహ్వానించ దగిన పరిణామం. 2029 డిసెంబరు నాటికి మాదక ద్రవ్యాల తుది ఆనవాలు కూడా లేకుండా చేస్తానని శపథం పట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈశాన్య భారతం లో వందకోట్ల మాదకద్రవ్యాలను పట్టి, వాటి రవాణా చేస్తున్న 18 మందిని అరెస్టు చేశారు. కేంద్ర హోంశాఖ పట్టు పట్టిందంటే నేరమూలాలను పసికట్టే తీరుతుంది. 2024లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాదకద్రవ్య అక్రమ రవాణాపై నిఘాపెట్టారు. తాజాగా ఈశాన్య రాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ న్ను ఛేదించడం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. ఈ నెట్వర్క్ ‘డెత్ ట్రయాంగిల్ కారిడార్’ భారత్, మయన్మార్, బంగ్లా దేశ్ సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. దేశ యవనికను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాల దందాను తుడిచిపెట్టడానికి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు ‘నశా ముక్తాభారత్’ కేవలం చట్ట అమలుకే పరిమితం కాకుండా, దేశభద్రతను, భవిష్యత్ తరాలను కాపాడే ఒక జాతీయ ఉద్యమంగా మారింది. సరఫరా వ్యవస్థలను పూర్తిగా నిరోధిస్తూ, సరైన ఆర్థిక మూలాలను దెబ్బతీయడం దీని విజయంలో కీలక ఘట్టంగా చెప్పవచ్చు.
Read Also : Sangareddy Brewery Industry: నీటి కొరతతో బీర్ల తయారీకి ఆటంకాలు?

Drug-Free India : డ్రగ్ మాఫియాకు వెన్నెముక
దేశం మత్తు పదార్థాల నెట్వర్పై అత్యంత కఠినమైన, వ్యూహాత్మక యుద్ధాన్ని ప్రకటిస్తోంది. నశా ముక్త భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు, కోస్ట్ గార్డ్ వంటి ఏజెన్సీలు ఏకోన్ముఖంగా పనిచేస్తున్నాయి. భవిష్య త్తులో దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరిస్తున్న డ్రగ్స్ ముఠాలను నిర్మూలించేందుకు సుదీర్ఘమైన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ‘విజన్ డాక్యు మెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ ను అమల్లోకి తెచ్చారు. గతంలో కేవలం డ్రగ్స్ రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికే పరిమితమైన వ్యవస్థ, ప్రస్తుతం డ్రగ్స్ సప్లై చైన్, వాటి ఆర్థిక మూలా లను నాశనం చేయడంపై దృష్టి పెట్టింది. తీరప్రాంతాలు, సరిహద్దుల ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్ను అడ్డుకునేం దుకు బిఎస్ఎఫ్, ఇండియన్ కోస్టార్డ్ రాష్ట్రాల నిఘా వర్గాలను బహుళ ఏజెన్సీ సమన్వయ వేదికపైకి తీసుకు వచ్చారు. డ్రగ్ మాఫియాకు వెన్నెముకగా ఉన్న ఆస్తుల్ని నిలువరించడం పెద్ద దెబ్బే. ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల అస్సాం, మిజోరం, మణిపూర్ లలో నిర్వహించిన భారీ దాడుల్లో ఒకేసారి 38 ప్రదేశాలపై దాడులు చేసి, హవాలా మార్గాల ద్వారా జరిగిన 100 కోట్ల నెట్వరు ఛేదించారు. అందులో 1,424 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. గుజరాత్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా వర్గాలు జరిపిన మెరుపు దాడిలో ఇరానియన్ బోటు నుండి దాదాపు 526 కిలోల మెథాం ఫెటమైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రవాణా పై చేపట్టిన ఒక భారీ చర్య
దేశవ్యా ప్తంగా 2014-2026 మధ్యకాలం వేలకోట్ల రూపాయల విలువైన 1.18 కోట్లకు పైగా కిలోల మత్తు పదార్థాలను భద్రతా బలగాలు జప్తు చేశాయి. 30 రెట్లు పెరిగింది. కేవలం డ్రగ్స్ నే కాకుండా, ఆ ముఠాల బ్యాంకు ఖాతాలు నస్పెండ్ చేయడం, హవాలా నిధులను స్తంభింపజేయడం వంటి చర్యలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల రీత్యా కేసుల నమోదు 181 శాతం పెరిగింది. ఈసారి రూ.17.82 కోట్ల విలువైన ఆస్తుల జప్తు 500 డిటోనేటర్లు. రూ.12లక్షల నగదును స్వాధీనం చేసుకోవ డం, 18 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మిజోరంలోని ఐజ్వాల్, చంఫాయ్, జోఖావ్ర్, మణిపూర్లోని చురా చంద్పూర్, అస్సోంలోని కచార్ ప్రాంతాలలో అంతర్జాతీయ ‘నార్కోహవాలా’ నెట్వరన్ను కేంద్ర ఏజెన్సీలు, పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై చేపట్టిన ఒక భారీ చర్యలో భాగంగా, అస్సాం, మిజోరం, మణిపూర్లలోని 38 ప్రదేశాలలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. మయ న్మార్ నుండి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ‘హవాలా’ పద్ధతిలో పరిష్కరిం చుకుంటున్నారనే ఆరోప ణలపై కేంద్ర ఏజెన్సీలు సోదాలు నిర్వహించాయి. సరు కులను తరలించడానికి మయన్మార్ నిర్వాహకులు స్థానిక రవాణాదారులను నియమించుకు న్నారు.

యువతను డీఎడిక్షన్ సెంటర్లకు పంపాలి
ఈశాన్య ప్రాంతం నలుమూలల నుండి మాదక ద్రవ్యాల ద్వారా వచ్చిన ఆదా యాన్ని స్వీకరించే ‘హవాలా’ ఖాతాల ద్వారా చెల్లింపులు జరిగాయి. మయన్మార్ నుండి మాత్రమే వచ్చే మెధీంఫెట మైన్ సరఫరా ఆగితే తప్ప ఈ అక్రమ రవాణా అంతం కాదు. మిజోరంలోని చంఫాయ్, ఐజ్వాల్, లాంగ్ య్ లోని బ్యాంకు ఖాతాలు మాదక ద్రవ్యాల డబ్బును స్వీక రించి, మయన్మార్లోని సరఫరా దారులతో పరిష్కరించుకున్నాయని ఈడీ తెలిపింది. అక్టోబరు 23న అస్సాం, మిజోరం మణిపూర్ లో ఒక అంత ర్జాతీయ నార్కోకార్టెల్ను ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసుల, డైరెక్టరేట్ డైరెక్టర్ల సమన్వయం తో ఈ ఆపరేషన్ జరిగింది. రోజుల తరబడి రహస్య నిఘా సమాచారం చేపట్టిన ఈ సమన్వయ చర్యలో, మిజోరంలోని ఐజ స్వాల్, చంఫాయ్, జోభావార్, మణిపూర్ లోని చురాచంద్పూర్, అస్సాంలోని కచార్ ప్రాంతంలోని రవాణా మార్గం వంటి ప్రధాన పట్టణ కేంద్రాలు, సున్నిత మైన సరిహద్దు కారిడార్లను సమగ్రంగా కవర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల యువతను డీఎడిక్షన్ సెంటర్లకు పం పాలి. వారందరికీ ఉపాధి కల్పన అత్యవసరం. ఎన్ని నెట్వర్క్ున్నా యువతను మంచి మార్గంవైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :