Artificial gold : ప్రపంచంలో వివిధ దేశాల సంపన్నతను వారి దగ్గర ఉండే బంగారు నిల్వలను బట్టి కూడా గణిస్తారు. ఏ దేశం వద్ద ఎక్కువ బంగారముంటే ఆ దేశం గొప్పదనుకునే రోజులివి. ప్రస్తుతం ఇదే అంచనాతో చైనా, పోలాండ్, టర్కీ వంటి దేశాలు విపరీతంగా బంగారం కొంటున్నాయి. అవన్నీ తమ సామాజిక హోదాను పెంచుకోవడానికే. జాతీయభద్రత అనే ఐడియాతో అమెరికా 2025లో బంగారాన్ని స్థిరీకరిం చింది. అదే అమెరికన్లకు మనో ధైర్యాన్నిస్తుందన్నది తెలి సిందే. అందుకేనేమో అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ అణుసాంకేతికత ద్వారా బంగారాన్ని తయారు చేసే సామ ర్థ్యాన్ని సాధించింది. చిన్నమెత్తు బంగారం చేయగలిగినా ఆ దేశం మనకార్యాల్లోకి చేరిపోతుంది. భారతీయులకు పరుస వేది విద్య చిరపరిచితమే అయినా ఆవిద్యకు లోబడి తయా రైన బంగారాన్ని ఎప్పుడూ చూసి తరించిన సందర్భాలు ఏమీ తారస పడలేదు. కానీ వేమనకాలంలో బంగారం తయారుచేసే పనిలో వేమన తన జీవితాన్ని త్యాగం చేశా రని ప్రతీతి. యోగి వేమన లేదా ప్రాచీన భారతీయ రస వాదులు సిద్ధులు, నాగార్జునుడు వంటివారు పరుస వేది విద్య/ ఆల్కెమీ పాదరసం, మూలికలను ఉపయోగించి బంగారాన్ని తయారు చేసేవారనే ప్రచారం మన దేశంలో శతాబ్దాలుగా ఉంది. వేమన పద్ధతులు, మూలికలు, గంధాలు, సాధారణ రసాయనిక భాగాలు, ప్రత్యేక యోగ మార్గాలతో కూడిన ప్రయోగాలుగా చెబుతారు. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేదా పునరావృత నిరూపణలు లేవు. ఇది చాలామందికి ఒక ఆధ్యాత్మిక రహస్యంగా లేదా కల్ప నగా మిగిలిపోయింది.
Read Also : New GST Rules From November 1 : నవంబర్ 1 నుంచి కొత్త GST నిబంధనలు

Artificial gold : రేడియో ధార్మిక అవశేషాలు ఉండే అవకాశం
భారతీయ రసశాస్త్రంలో ‘పరుసవేది’ లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియతోపాటు మానవ దేహాన్ని ఆరోగ్యవంతంగా, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేర్చే భౌతిక రసాయన ఆధ్యాత్మిక సమన్వయానికి ప్రతికగా అభి వర్ణిస్తారు. శతాబ్దాలుగా రసవాదులు కన్న కల, పనికిరాని లోహాలను విలువైన బంగారంగా మార్చాలన్న ఆశయం. సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివిన అద్భుతం. ఇప్పుడు ‘హైరేట్ ఆల్కెమీ’ రూపంలో వాస్తవరూపం దాల్చింది. మ్యారథాన్ ఫ్యూజన్ 2025లోనే విడుదల చేసిన ఒక పరిశోధన పత్రం లో, వాణిజ్యస్థాయిలో ఒక గిగావాట్ సామర్థ్యం గలఫ్యూజన్ పవర్ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు రెండుటన్నుల బంగా రం ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేసింది. ఇది నిజమైతే ప్రపంచ బంగారం మార్కెట్‌పై పెను ప్రభావం చూపు తుంది. తాజా తయారీలో బంగారుదిమ్మెలు ఇప్పటికిప్పుడు తయారై మిరుమిట్లుగొలుపుతాయంటే నమ్మలేం. అయితే, ఇవి కేవలం సిమ్యులేషన్ల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. వాణిజ్యస్థాయిలో ఫ్యూజన్జయాక్టర్లు అందుబాటు లోకి రావడానికి ఇంకా దశాబ్దాల సమయం పట్టవచ్చు. అంతే కాక, ఈపద్ధతిలో తయారైన బంగారంలో రేడియో ధార్మిక అవశేషాలు ఉండే అవకాశం ఉందని, దానిని సురక్షి తంగా మార్చేందుకు 14 నుంచి 18 ఏళ్లు నిల్వ ఉంచాల్సి రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలంల్యాబ్లలో జరిగే అణుప్రక్రియ. దీనిద్వారా పెద్దఎత్తున బంగారాన్ని తయారు చేయడం ప్రస్తుతానికి అత్యంత ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి, రేపు పొద్దునే మార్కెట్లోకి ఈ కృత్రిమ బంగారం తన్నుకొచ్చి ధరలు పడిపోతాయని చెప్పలేం.
పాదరసం నుంచి బంగారిన్న
కేవలం బంగారం తయారీ మాత్రమే కాకుండా, క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స లో ఉపయోగపడే కాపర్ 64, కాపర్67 వంటి అత్యంత విలువైన వైద్య ఐసోటోప్‌లను కూడా జింక్ నుంచి ఉత్పత్తి చేసినట్టు మ్యారథాన్ ఫ్యూజన్ ప్రకటించింది. మొత్తంమీద, ఒక మూలకాన్ని బంగారంగా మార్చడం శాస్త్రీయంగా సాధ్య మేనని మరోసారి నిరూపితమైంది. సాధారణంగా రసాయ నిక ప్రక్రియలతో మూలకాలను మరో మూలకంగా మార్చ డం అసాధ్యం. అణుసంలీనం తరహా ప్రక్రియతో మూలకం కేంద్రకంలో మార్పులుచేసి మరో మూలకంగా మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఇదే ‘న్యూక్లి యర్ ట్రాన్స్ మ్యూటేషన్’ అంటారు. ఇప్పుడు ఈ విధానంలోనే పాదరసం నుంచి బంగారిన్న రూపొందించామని, ఇందుకోసం అణుసంలీనం చర్యలో వెలువడిన అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లను వినియోగించామని మ్యారథన్ ఫ్యూషన్ సంస్థ ప్రకటిం చింది. ఆ వివరాల మేరకు పాదరసం (మెర్క్యురీ -198) మూలకాన్ని అత్యంత శక్తివంత మైన న్యూట్రాన్లతో ఢీకొట్టి నప్పుడు దాని పరమాణువుల నుంచి ఒక న్యూట్రానన్ను కోల్పోయి, మెర్క్యురీ -197 ఐసోటోప్‌గా మారింది. ఈ ఐసోటోప్‌కు రేడియోథార్మిక లక్షణాలు ఉంటాయి. ఈ క్రమం లో స్థిరత్వం కోసం మెర్క్యురీ -197ఐసోటోప్ ఒక ప్రొటా న్ను కోల్పోయి, తర్వాత ఒక శక్తివంతమైన న్యూట్రానన్ను సంగ్రహించి బంగారం 197 ఐసోటోప్ మారినట్టు కంపెనీ వెల్లడించింది.

దశాబ్దాల కాలం పట్టొచ్చు
యూరోపియన్ యూనియన్‌కు చెందిన అణు పరిశోధన సంస్థ ‘సెర్న్’ శాస్త్రవేత్తలు 2025లో లార్జ్ హైడ్రా న్ కొలైడర్ (ఎలెచ్చీ) పరికరంతో ప్రయోగాలు చేస్తున్న సమ యంలో 29 పికోగ్రాముల (ఒక పికోగ్రాము అంటే గ్రాము లో లక్షో వంతు) బంగారాన్ని తయారు చేసినట్లు ప్రకటిం చారు. సీసం (లెడ్) మూలకం నుంచి బంగారం ఉత్పత్తి అయినట్టు తెలిపారు. దానితో పోలిస్తే పదింతలు ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగామని మ్యారథాన్ ప్యూషన్ సంస్థ తాజాగా పేర్కొంది. ఇలా భారీగా బంగారం తయా రు చేయడానికి దశాబ్దాల కాలం పట్టొచ్చు. ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి రేటు 2025లో ‘కెర్న్’ నెలకొల్పిన రికార్డు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని కంపెనీ చెబుతున్నది. అయితే ఈ ప్రయోగంలో అసలు ఎంత బంగారం ఉత్పత్తి అయిందనే కచ్చితమైన మొత్తాన్ని కంపెనీ ఇంకా వెల్లడించ లేకపోయినా తమ ప్రయత్నాలు ఫలించినట్లు ఘనంగా చెప్పినట్లయ్యింది. ఈ కంపెనీ చెబుతున్న విధానం కేవలం కెమికల్ రియాక్షన్ కాదు, ఇది పూర్తిగా ‘న్యూక్లియర్ ట్రాన్స్ మ్యూటేషన్’ కేంద్రక రూపాంతరం అనే అణుప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రత్యేక ఐసోటోప్ అయిన ‘పాదరసం198’ను ఫ్యూజన్ రియాక్టర్‌లోకి పంపిస్తారు. అక్కడ హైడ్రోజన్ ఐసోటోపుల కలయిక వల్ల వెలువడే అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లు ఈ పాదరసాన్ని తాకిన ప్పుడు, అది అస్థిరమైన ‘పాదరసం 197’ గా మారుతుంది. ఆ తర్వాత ఇది క్రమంగా క్షీణించి స్థిరమైన ‘బంగారం 197’ గా రూపాంతరం చెందుతుంది. భౌతికశాస్త్ర సూత్రాల ప్రకా రం ఇది సిద్ధాంతపరంగా సాధ్యమే. గతంలో సార్న్ (సిఇ ఆర్ఎన్) లాంటి సంస్థలు కూడా పార్టికల్ యాక్సిలరేటర్ల ద్వారా ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఏది ఏమైనా కనుచూపు మేరలోకి క త్రిమ బంగారం వాణిజ్యం ఉత్పత్తుల స్థాయికి చేరుకోవడం అసాధ్యమే!
-వరిగొండ నవీన్‌కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: