చాలా ప్రమాదకరమైన పరిస్థితులో ఉన్నట్లు వ్యాఖ్యానించారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. ఎప్పుడూ విభిన్న వ్యాఖ్యలతో, ఆచరణలతో వార్తల్లో నిలిచే ట్రంప్, తాజాగా అమెరికా అధ్యక్ష పదవి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, అంతర్జాతీయ మాధ్యమాల్లోనూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి ఇతరులకు ప్రమాదకారిగా మారిన డొనాల్డ్ ట్రంప్, తాజాగా తానే చాలా ప్రమాదకరమైన పరిస్థితులో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవిని చాలా ప్రమాదకరమైన వృత్తిగా అభివర్ణించారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ (Donald Trump) తన అధ్యక్ష పదవీ కాలంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, ప్రత్యేకించి న్యాయపరమైన సమస్యల గురించి ప్రస్తావించారు.
అధ్యక్షుడిగా ఉండటం ఎంత ప్రమాదకరమో నాకు అర్థమైంది
గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నేను దేనికీ భయపడలేదు. కానీ ఇప్పుడు, అధ్యక్షుడిగా ఉండటం ఎంత ప్రమాదకరమో నాకు అర్థమైంది” అన్నారు. ఈ పదవి కేవలం రాజకీయ సవాళ్ళతో కూడుకున్నది కాదని, అది వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు తెస్తుందని ఆయన అన్నారు.అధ్యక్ష పదవి (Presidency) ని ప్రమాదకరమైనదని, సవాళ్లతో కూడుకున్నదని చెప్పుకొచ్చిన ట్రంప్, అధ్యక్ష బాధ్యతలను ఇతర ప్రమాదకరమైన వృత్తులతో పోల్చారు. కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమని అన్నారు.

తీవ్ర స్థాయిలో
ఈ విషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే, తాను ఈ రేసులో ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన ఉద్ఘాటించారు. ట్రంప్ తన ప్రసంగంలో తన ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. జో బైడెన్ (Joe Biden) పరిపాలనపైనా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని, సరిహద్దుల వద్ద అల్లర్లు జరుగుతున్నాయని, ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ట్రంప్ ఆరోపించారు.గతంలో ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే.
ఫెన్సింగ్ వద్దకు
పెన్సిల్వేనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ భవనంపై నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్ (West Palm Beach) లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో రావడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం కాల్పులు జరిపి అతడిని అరెస్టు చేశారు. కొన్ని రోజుల అనంతరం ట్రంప్ పాల్గొన్న సమావేశానికి సమీపంలో ఉన్న నేషనల్ కన్వెన్షన్ సమీపంలో మాస్క్ ధరించి ఆయుధంతో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్