RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!

RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు కేంద్ర మద్దతు కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానికి లేఖ రాశారు. అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ప్రధానిని కలవాలన్న అభ్యర్థనను లేఖలో పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మద్దతు కోరారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. పార్లమెంట్‌ ఆమోదం పొందేలా కలిసి కట్టుగా కృషి చేసేందుకు అఖిలపక్షాలు సంసిద్దమయ్యాయి.తెలంగాణలో ఇప్పుడు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో , షెడ్యూల్‌ కులాలు 15 శాతం, షెడ్యూల్‌ తెగలు 7శాతం, మైనార్టీలు 4 శాతం, BCలకు 23 శాతం రిజర్వేషన్లు వున్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగుణ నివేదిక ప్రకారం బీసీలు 56.36 శాతం . ఆ మేరకు రిజర్వేషన్ల పెంపుఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మద్దతు కోరనుంది అఖిలపక్షం,అపాయింట్‌మెంట్‌ కోరుతూ మోదీకి లేఖ వెళ్లింది. ఇక ప్రధాని కార్యాలయం నుంచి పిలుపే తరువాయి అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనుంది.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరు మార్పు

సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​కు మరో లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్​ రెడ్డి పేరును పెట్టడంతో,పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ రెండు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, తెలంగాణలో సామాజిక న్యాయ పరిరక్షణకు మరింత ఊరట లభించనుంది.

Related Posts
అతుల్ సుభాష్ ఆత్మహత్య: భార్య-కుటుంబానికి బెయిల్
అతుల్ సుభాష్ ఆత్మహత్య: భార్య-కుటుంబానికి బెయిల్

గత నెలలో ఆత్మహత్య చేసుకున్న ఆటోమొబైల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అతుల్ సుభాష్ భార్య, ఆమె తల్లి, బావమరిది తదితరులకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్డర్ Read more

Summer Tour:సమ్మర్ టూర్ కి వెళ్లేముందు ఇవి ముఖ్యం ..
Summer Tour:సమ్మర్ టూర్ కి వెళ్లేముందు ఇవి ముఖ్యం ..

వేసవి సెలవులు వచ్చాయంటే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారు చాలామందే ఉంటారు. కొందరు విహారయాత్రలకు వెళ్తారు, మరికొందరు బంధువుల ఇళ్లకు వెళతారు. అయితే, వేసవి Read more

క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!
క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!

కేవలం 95 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన, వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ Read more

మూడ‌వ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర ఆమోదం
ashwini vaishnaw

ఇటీవల కాలంలో శ్రీహ‌రికోటలో చారిత్మాక ప్రయోగాలు జరుగుతూ ప్రపంచ పటంలో నిలిచింది. దీనితో భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రానికి ప్రాధ్యానత పెరిగింది. శ్రీహ‌రికోటలో మూడ‌వ లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *