Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది.

Advertisements
గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు

పరిస్థితులు మళ్లీ మొదటికే

ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.

ఇజ్రాయెల్ వైమానికి దాడులు

ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దక్షిణ సిరియాలోని మిలటరీ కమాండ్ సెంటర్ లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తోంది. సిరియాను అసద్ పాలిస్తున్నప్పుడు ఈ స్థావరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులను సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి ఇప్పుడు తమకు ప్రమాదం పొంచి ఉందనే కారణంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

Related Posts
TG-TET Notification : టెట్ నోటిఫికేషన్ విడుదల
TS TET Notification2

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యాశాఖ తాజాగా టెట్ (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారికంగా Read more

1600 మందికి ట్రంప్ క్ష‌మాభిక్ష‌
Attack on Capitol Hill... Trump pardons 1600 people

వాషింగ్టన్‌: 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన సుమారు 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు Read more

IPL 2025 : IPLలో ఈరోజు ధూమ్ ధాం 2 మ్యాచులు
GTvsDC

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈరోజు అభిమానులకో డబుల్ ధమాకా మ్యాచ్‌ల రోజు. మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ Read more

Rahul Gandhi: యువతకు ఉపాధి కల్పించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: అమరావతి యువతకు ఉపాధి కల్పించిన రాహుల్ గాంధీ

యువత కోసం నిలదీసిన రాహుల్ బీహార్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ తమ తమ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×