వేసవి సెలవులు వచ్చాయంటే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారు చాలామందే ఉంటారు. కొందరు విహారయాత్రలకు వెళ్తారు, మరికొందరు బంధువుల ఇళ్లకు వెళతారు. అయితే, వేసవి కాలంలో వాతావరణం అత్యధికంగా వేడిగా ఉండే కారణంగా, ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా, ఎండ వేడిమి నుంచి రక్షించుకోవడానికి ప్రయాణాన్ని సౌకర్యంగా మార్చుకోవడానికి కొన్ని అవసరమైన వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
సన్‌స్క్రీన్
ఎండలో ఎక్కువ సమయం గడిపితే చర్మం మెలనిన్‌ను ఉత్పత్తి చేసి టాన్ అవుతుంది. దీని వల్ల చర్మం కండరాలకు నష్టం వాటిల్లే అవకాశముంది. కాబట్టి, బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది చర్మాన్ని యూవి కిరణాల ప్రభావం నుండి కాపాడుతుంది. 30 ఎస్ పిఎఫ్ లేదా అంతకంటే ఎక్కువ ఎస్ పిఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం ఉత్తమం.

నీరు
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణంలో ఎక్కువగా చెమట పట్టే అవకాశం ఉన్నందున, తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కనీసం 2 లీటర్ల నీటిని మీతో తీసుకెళ్లడం మంచిది. పొడిబారిన వాతావరణంలో నీరు మాత్రమే కాదు, కొబ్బరి నీరు, గ్లూకోజ్, నిమ్మరసం వంటి ద్రావణాలను తీసుకోవడం కూడా శరీరానికి మేలు చేస్తుంది.
కాటన్ దుస్తులు
వేసవి కాలంలో ప్రయాణిస్తున్నప్పుడు గాలి పట్టే, తేలికపాటి దుస్తులు ధరించడం ఉత్తమం. బిగుతుగా ఉండే నైలాన్, పాలిస్టర్ దుస్తుల కన్నా, సూతి (కాటన్) దుస్తులే వేసవి వేడిని తట్టుకోవడానికి సరైనవి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, చెమట ద్వారా వచ్చే అలర్జీలు, దద్దుర్లు వంటి సమస్యల నుంచి రక్షించగలవు.

సన్ గ్లాసెస్
ఎండ తాకిడిని తగ్గించేందుకు సన్ గ్లాసెస్ చాలా ఉపయోగకరం. ప్రత్యేకించి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా రోడ్డు మార్గంలో ఎక్కువ ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్లను యూ వి కిరణాల ప్రభావం నుండి కాపాడేందుకు ఇవి అవసరం. మంచి యూవి ప్రొటెక్షన్ గ్లాసెస్‌ను ఉపయోగించడం వల్ల కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
హ్యాట్లు లేదా స్కార్ఫ్
బయట ఎక్కువగా సమయం గడిపే వారు హ్యాట్లు, స్కార్ఫ్‌లు ఉపయోగించడం ఉత్తమం. ఎండ నుంచి తల, మెడ భాగాన్ని కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా, బీచ్‌లు లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, ఇది చాలా అవసరం.

కూలింగ్ స్ప్రే
వేడి కారణంగా ముఖం చెమటతో తడిగా మారుతుంది. అలాంటి వేళల్లో ముఖాన్ని తడి వైప్స్‌తో శుభ్రం చేసుకుంటే చల్లదనాన్ని పొందొచ్చు. అలాగే, కొందరు క్యారీబుల్ మిస్ట్ స్ప్రేలు కూడా ఉపయోగిస్తారు.
ఫస్ట్ ఎయిడ్ కిట్
ప్రయాణంలో చిన్న చిన్న గాయాలు, అలర్జీలు, నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రాథమిక చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా బ్యాగ్‌లో ఉంచుకోవాలి. ఇందులో బాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు, గ్యాస్ ట్రబుల్ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి.

స్నాక్స్
ప్రయాణంలో ఎక్కువ సమయం క్లోజ్‌డ్ ఫుడ్ అవేలబుల్ కాకపోవచ్చు. కాబట్టి, హెల్తీ స్నాక్స్ తీసుకెళ్లడం మంచిది. డ్రై ఫ్రూట్స్, నట్స్, మిలెట్ బిస్కెట్లు, గోధుమ బ్రెడ్ వంటి తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను క్యారీ చేయడం ఉత్తమం.వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాహం తగ్గించడానికి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ, నిమ్మరసం, బెల్లం మజ్జిగ, పెరుగు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. ప్రయాణంలో వీటిని కనీసం ఒకటిరెండు ఉండేలా చూసుకోవాలి.
శరీరాన్ని తేమగా ఉంచే లోషన్లు
వేసవిలో ఎండ తగలడంతో చర్మం పొడిగా మారుతుంది.కాబట్టి, మంచి మాయిశ్చరైజర్ లేదా లోషన్ ఉపయోగించడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. ప్రత్యేకించి, చేతులు, కాళ్లు పొడిబారకుండా చూసుకోవాలి.వేసవి కాలంలో ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. చర్మాన్ని యూ వి కిరణాల నుంచి కాపాడుకోవడం, తగినంత నీరు తాగడం, కాటన్ దుస్తులు ధరించడం ద్వారా వేడి నుంచి రక్షించుకోవచ్చు. పై చెప్పిన ముఖ్యమైన వస్తువులను బ్యాగ్‌లో ఉంచుకుంటే, ప్రయాణం సాఫీగా ఆనందంగా సాగుతుంది.