YSRCP wins Kadapa district ZP chairman post

YCP: కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైసీపీ కైవసం

YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమయింది. అయితే యాభై జడ్పీటీసీ స్థానాల్లో నలభై మందికి పైగానే వైసీపీకి చెందిన జడ్పీటీసీలు ఉన్నారు. టీడీపీకి పదిమందికి మించి లేరు. దీంతో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమషన్ నిర్ణయించడంతో వైసీపీ తమ పార్టీకి చెందిన జడ్పీటీసీలను క్యాంప్ నకు తరలించారు. అయితే తమ గెలుపునకు అవసరమైన బలం లేకపోవడంతో టీడీపీ ఈ ఎన్నికలో పోటీకి దింపలేదు. దీంతో వైసీపీ ప్రకటించిన గోవిందరెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

Advertisements
కడప జిల్లా జడ్పీ ఛైర్మన్

తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని టీడీపీ ప్రకటన

అయితే, టీడీపీ తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని అధికారికంగా ప్రకటించింది. ఇక, బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామ గోవింద రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడం ఇక లాంచనమే. కాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల పరిషత్ లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగునున్నాయి. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక, కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జెడ్పీటీసీలు అందరు క్యాంప్లో ఉన్నారు. సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్నారు వైసీపీ జడ్పిటిసిలు.. గత నాలుగు రోజులుగా క్యాంపులో ఉన్నారు. జిల్లా పరిషత్తులో వైసీపీ సంపూర్ణ మెజార్టీ.. 50 మంది జెడ్పీటీసీలకు గాను వైసీపీలో 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు.

Related Posts
పెంటగాన్ ఉద్యోగ కోతలు: 5,400 మంది తొలగింపు
పెంటగాన్ ఉద్యోగ కోతలు: 5,400 మంది తొలగింపు

భాగంగా, వచ్చే వారం నుండి 5,400 ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగ కోతలు ఏందుకు?ప్రధాన కారణం: సామర్ధ్యాలను ఉత్పత్తి చేయడం & బడ్జెట్ పొదుపుకొనసాగే Read more

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!
Telangana cabinet meeting has been finalized

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం Read more

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు
Tenth Hall Tickets Available Today

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి Read more

కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం
key meeting of the Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈరోజు గాంధీభవన్లో PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×