బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో రంజాన్ కు కిట్ల పంపిణీ

Ramjan : బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో రంజాన్ కు కిట్ల పంపిణీ

ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 1వ తేదీన నెలవంక కనిపించడంతో ఈ పండగ సందడి ఆరంభమైంది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్‌కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. నెలవంక దర్శనంతో ఆరంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్ర దర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు.
మోదీ సహా..

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో రంజాన్ కు కిట్ల పంపిణీ

ప్రార్థనలు ఫలించాలని.. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలంటూ అభిలాషించారు. అటు హైదరాబాద్‌లో పండగ కోలాహలం కొనసాగుతోంది. రంజాన్ చాంద్ కనిపించిన వెంటనే హైదరాబాద్ పాతబస్తీకి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. భారీగా విక్రయాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- పాతబస్తీలో కొనుగోలుదారుల సందడి ఈ నెల రోజుల పాటు కనిపించింది.
మార్కెట్లన్నీ కళకళ

షాపులు రద్దీగా మారాయి. కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి. చార్మినార్, పరిసర ప్రాంతాల్లో ఈద్ కోలాహలం కనిపించింది. జాతరను తలపించింది. జుమా మసీదు‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం ఛాదర్లను పరిచారు. షామియానాలను. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి షామియానాలను వేశారు. అక్కడి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక దేశం మొత్తం కూడా రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి సన్నద్ధమౌతోంది. 32 లక్షల మంది పేద ముస్లింలకు.. రంజాన్ పండగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఈ కిట్లకు సౌగత్-ఇ-మోదీ అని పేరు పెట్టారు.
జేపీ మైనారిటీ వింగ్

బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కిట్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ నెల 31న ఈద్ జరుపుకునే అవకాశం ఉన్నందున.. ఆ రోజున దేశంలోని 32 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో బహుమతులు అందజేస్తామని బీజేపీ మైనారిటీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ తెలిపారు. సౌగత్-ఎ-మోదీ.. జిల్లా స్థాయిలో సౌగత్-ఎ-మోదీ కిట్లను పంపిణీ చేయడంతో పాటు ఈద్ మిలన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ వెల్లడించింది. ఈ కిట్లను పంపిణీ చేయడానికి 32,000 మంది పార్టీ కార్యకర్తల సేవలను వినియోగించుకోనుంది బీజేపీ అధిష్ఠానం.

Related Posts
గ్యారెంటీ అమలు కోసం కర్ణాటక సర్కార్ తిప్పలు!
గ్యారెంటీ అమలు కోసం కర్ణాటక సర్కార్ తిప్పలు!

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు గ్యారెంటీల పేరిట పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్‌ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ Read more

ట్రాక్ పై సిమెంట్ దిమ్మె.. ఢీకొట్టిన రైలు
cement blocks on railway tr

ఇటీవల రైలు ప్రమాదాలకు భారీగా కుట్రలు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారో..ఆకతాయితనం తో చేస్తున్నారో కానీ దీనివల్ల రైలు ప్రయాణికులు భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు. రైలు ట్రాక్ లపై Read more

ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్

ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే ప్రేమికులకు గుడ్ టైమ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాలంటైన్స్ వీక్ కొనసాగుతుండగా దానిని మరింత క్రేజీగా మార్చేందుకు విమానయాన సంస్థలు సైతం Read more

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో బస్సు నది‌లో పడింది.
pok

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో గిల్‌గిట్-బాల్టిస్టాన్ ప్రాంతంలో నవంబర్ 12న ఒక దుర్ఘటన జరిగింది. ఒక బస్సు, దాదాపు ఇరవై మంది వివాహ అతిథులను తీసుకుని, ఇండస్ నదిలో పడిపోయింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *