తెలంగాణలో చైనా ఈవీ కార్ల తయారీకి గ్రీన్ సిగ్నల్

China: తెలంగాణలో చైనా ఈవీ కార్ల తయారీకి గ్రీన్ సిగ్నల్

పారిశ్రామికరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించినట్టే. చైనాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ.. బీవైడీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ బీవైడీ. హైదరాబాద్ సమీపంలో వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు మొదలు పెట్టనుంది. ఆ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న చర్చలు కొలిక్కి వచ్చాయి. భూ కేటాయింపులు సహా అన్ని రకాలుగా ఆ సంస్థకు రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.

Advertisements
తెలంగాణలో చైనా ఈవీ కార్ల తయారీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ పరిసరాల్లో మూడు ప్రాంతాలు
ఈ యూనిట్ కోసం హైదరాబాద్ పరిసరాల్లో మూడు ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింట్లో ఎక్కడ తమ ఈవీ వాహనాలు, కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పితే బాగుంటుందనే విషయం మీద బీవైడీ ప్రతినిధులు చర్చలు సాగిస్తోన్నారు. ఈ మూడింట్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న తరువాత ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని బీవైడీ ప్రతినిధులు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా కనెక్టివిటీ గురించి ఆ సంస్థ యాజమాన్యం సమాలోచనలు చేస్తోంది. ఎయిర్, రోడ్, రైలు కనెక్టివిటీ సులభతరంగా ఉండాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే- దేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇది- తెలంగాణ దశ- దిశను మార్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
బీవైడీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభించడం ఖాయమౌతుంది. దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమౌతాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ కూడా బీవైడీ ఈవీ వాహనాల తయారీ యూనిట్లు లేవు. ఈ కార్లను కొనుగోలు చేయాలంటే చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ధరలు భారీగా తగ్గే అవకాశం!
అలాంటిది- ఇక్కడే తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడం వల్ల వాటి ధరలు భారీగా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. అదే సమయంలో- ఆసియా దేశాల్లో తమ వాహనాలను విక్రయించుకోవడానికి కూడా బీవైడీ సంస్థ హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవంక- అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లాకు పోటీగా చైనా బీవైడీ కార్లు తయారవుతాయని అంటున్నారు. చైనా, యూరోపియన్ మార్కెట్‌లో టెస్లా కార్ల అమ్మకాలపై బీవైడీ ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి.

Related Posts
పాపం కెనడా ప్రధాని ట్రూడో కంటతడి.. వీడియో వైరల్‌
పాపం కెనడా ప్రధాని ట్రూడో కంటతడి.. వీడియో వైరల్‌

ట్రంప్‌ కొరడా దెబ్బలు కొడుతుంటే, కన్నీళ్లు కారుతున్నాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటుందోంది. ఇది ఏ కామన్‌మ్యాన్‌కో కాదు.. ఏకంగా కెనడా ప్రధాని కన్నీళ్లు కార్చాడు. కెనడా ప్రధాని Read more

Iran-US: ఇరాన్-అమెరికా అణు చర్చలు
ఇరాన్-అమెరికా అణు చర్చలు

ఇరాన్ అణు కార్యక్రమంపై రెండవ రౌండ్ చర్చలు మొదలయ్యే వేళ, మిడ్ ఈస్ట్ జలాల్లో రెండవ యుఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (USS కార్ల్ విన్సన్) ఉనికిని పెంచింది. Read more

13 నిమిషాల్లోనే డోనర్ గుండె త‌ర‌లింపు..
Donor's heart moved within 13 minutes

హైదరాబాద్‌: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన Read more

కేటీఆర్ దావత్ పార్టీ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
KTRs brother in law Raj Pa 1

జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, “ఇళ్లలో దావత్‌లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×