ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే ప్రేమికులకు గుడ్ టైమ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాలంటైన్స్ వీక్ కొనసాగుతుండగా దానిని మరింత క్రేజీగా మార్చేందుకు విమానయాన సంస్థలు సైతం ఆఫర్ష వర్షం కురిపిస్తున్నాయి. ప్రేమికులకు మరపురాని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇండిగో సూపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వాలెంటైన్స్ డే సందర్భంగా టిక్కెట్ బుక్కింగ్స్ పై 50 శాతం వరకు తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం రెండు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకేనని స్పష్టం చేసింది. ఆఫర్ కింద బుక్కింగ్స్ ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. బుక్కింగ్ తేదీ నుంచి ప్రయాణానికి కనీసం రెండు వారాల గడువు ఉండాలని కంపెనీ వెల్లడించింది. అంటే దాదాపు ఒక్క టిక్కెట్ ధరతోనే ఇద్దరు ప్రయాణించటానికి వెసులుబాటు కల్పించబడిందని చెప్పుకోవచ్చు.

ప్రేమికులకు స్పెషల్ గిఫ్ట్
ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ప్రేమికుల కోసం అనేక ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ఒక్క టిక్కెట్ ధరకే ఇద్దరు ప్రయాణించే అవకాశం పొందవచ్చు.
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్ వివరాలు
టిక్కెట్ ధరపై 50% తగ్గింపు
ఈ ఆఫర్ రెండు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకే వర్తిస్తుంది
బుక్కింగ్స్ ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి
బుక్కింగ్ చేసిన తేదీ నుంచి కనీసం రెండు వారాల గడువు తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది
ఎక్కడ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు?
ప్రయాణికులు తమ టిక్కెట్లను ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ యాప్, 6E స్కై లేదా అధికారిక బుక్కింగ్ పార్ట్నర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అదనపు ప్రయోజనాలు – బ్యాగేజీ, సీట్లు, ఫుడ్ డిస్కౌంట్లు
15% తగ్గింపు – ప్రీపెయిడ్ బ్యాగేజీ ఛార్జీలపై
15% తగ్గింపు – స్టాండర్డ్ సీట్ల సెలక్షన్‌పై
10% తగ్గింపు – ఫుడ్ ప్రీ బుకింగ్‌పై
ఫ్లాష్ సేల్ – మెుదటి 500 టిక్కెట్ కొనుగోలుదారులకు అదనపు తగ్గింపు!
ఈ ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో భాగంగా, మెుదటి 500 మంది టిక్కెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది.
ఆఫర్ చివరి తేదీ – మిస్ చేసుకోవద్దు!
ఈ ప్రత్యేక ఆఫర్ ఫిబ్రవరి 16 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, బుక్కింగ్ అనంతరం ప్రయాణానికి కనీసం 15 రోజుల గడువు తప్పనిసరి అని ఇండిగో స్పష్టం చేసింది.