हिन्दी | Epaper

TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

Anusha
TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే, జూన్‌ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారికీ ఎలాంటి ఇబ్బందులకు లేకుండా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.మే, జూన్ నెలల్లో సెలవులు కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.. మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు” ఆయన వివరించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉత్సవాల్లో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకోసం మే 10న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ జరుగుతుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారి ఊరేగింపు ఉంటాయి.

 TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

పూజాసామగ్రి

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా జల్లి సంప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Read Also: Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టు ఊహించని షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆన్‌లైన్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

ఆన్‌లైన్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870