టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది,టీటీడీ యువత కోసం గోవింద కోటి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి, సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించడానికి రెండేళ్ల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రామకోటి తరహాలోనే ఈ గోవింద కోటి కార్యక్రమం కూడా ఉంటుంది. గోవింద కోటి రాసిన యువతకు టీటీడీ వీఐపీ దర్శనం(VIP break darshan) కల్పిస్తోంది. 25 ఏళ్లలోపు వయసున్నవారు 10,01,116 సార్లు గోవింద నామం రాస్తే వారికి ఈ అవకాశం దక్కుతుంది. కోటిసార్లు రాస్తే రాసిన వారితో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది.టీటీడీ గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది,టీటీడీ సమాచార కేంద్రాల్లో, పుస్తకాల షాపుల్లో, ఆన్‌లైన్‌లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఒక పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి.ఒక్కో పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు. ఇలా 10,01,116 నామాలు రాయాలంటే దాదాపు 26 పుస్తకాలు కావాలి. కోటి నామాలు రాయడానికి కనీసం మూడేళ్లు పడుతుందని టీటీడీ అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత తిరుమలలోని టీటీడీ పేష్కార్, కార్యాలయం(Peshkar Office)లో అందజేయాలి. అప్పుడు వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు.

మంచి అవకాశం
గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే అమ్మాయి మొదటిసారిగా ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది. ఆమె బెంగళూరులో ఇంటర్ చదివింది,ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకి అందజేసింది. ఆ అమ్మాయికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా గోవిందకోటి నామాలు రాసి వీఐపీ బ్రేక్ దర్శనం పొందారని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. గోవింద కోటి నామాలు పూర్తి చేసి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందాలని టీటీడీ సూచించింది. యువతకు ఇది మంచి అవకాశం అంటున్నారు.తిరుమలలో సోమవారం రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి(Vaisakha Purnima) గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమై రాత్రి 9గం వరకు కొనసాగింది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడంతో తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also : Tirumala: మరోసారి తిరుమలలో చిరుత కలకలం