సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామంలో చోటుచేసుకున్న మహిళ హత్యకేసు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే చిన్నకోడూరు మండలం(Chinnakodur Mandal) కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గాలి బాలలక్ష్మి, సుధాకర్ దంపతులకు కుమారుడు వెంకటేశ్, కుమార్తె స్వాతి ఉన్నారు. పిల్లలకు వివాహాలు పూర్తయ్యాయి. కాగా బాల లక్ష్మీ ఇంట్లోనే ఉంటూ చిన్న కిరణా షాప్ నడిపిస్తుంది. బాల్ లక్ష్మీ భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలోనే మే 30న బాల్ లక్ష్మీ అత్యంత దారుణంగా హత్యకు గురైంది.ప్రతి రోజు లాగానే భర్త సుధాకర్(Sudhakar) ఆటో తీసుకొని బయటకు వెళ్లగానే యధావిధిగా బాల లక్ష్మీ తన కిరాణా షాప్ లో ఉంది. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి వచ్చారు.కూల్ డ్రింక్స్(Cool drinks) కావాలని అడిగి తీసుకున్నారు.వచ్చిన వారు కూల్ డ్రింగ్ తాగుతూ ఉండగా, బాల లక్ష్మి టీ పెట్టుకోవటానికి ఇంట్లోకి వెళ్లింది.ఇదే అదునుగా భావించిన దుండగులు,ఇంట్లోకి చొరబడి బాల లక్ష్మి ఒంటి పై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కొని, గొంతు కోసి ఆమెను హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు.చాలా సేపటి నుండి బాల లక్ష్మి ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో బాల లక్ష్మి రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది.వెంటనే గ్రామస్థులకు, పోలీసు(Police)లకు సమాచారమిచ్చారు.

అవకాశం
ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ బాలకృష్ణ,వచ్చి పరిశీలించారు.భర్త సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాలలో విచారిస్తున్నారు.బాల లక్ష్మీ(Bala Lakshmi)ని చంపిన దుండగులు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.హత్యకు గురి అయిన బాల లక్ష్మి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్న అవి పనిచేయకపోవడంతో,కేసు జఠిలమయ్యే అవకాశం ఉంది.ఈ హత్య చేసింది కమ్మర్లపల్లి గ్రామ శివారులో ప్రాజెక్టుల్లో పని చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల లేబర్, లేదంటే ఇదే గ్రామానికి చెందిన వారెవరైనా ఈ హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇక బాల్ లక్ష్మి మృతితో కమ్మర్లపల్లి గ్రామం(Kammarlapalli village)లో విషాద ఛాయలు అలముకున్నాయి.హత్య చేసిన నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలని బాలలక్ష్మీ కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు కూడా కోరుతున్నారు.
Read Also: Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త