రేపు రిపబ్లిక్ డే వేడుకలకు రెండు రోజులు మాత్రమే ఉండగా, ఇంటెలిజెన్స్ అధికారులు ఒక ఉగ్ర కుట్రను ముందే ఆపినట్లు తెలుస్తోంది. జనవరి 26 నాటికి దేశవ్యాప్తంగా జరగనున్న ఘనోత్సవాల నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై నిరంతర గాలింపు చర్యలు(Security Alert) చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిఘా వర్గాలకు వచ్చిన సమాచారంతో, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు కలిసి పంజాబ్‌లో ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ (RDX) మరియు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అరెస్టు చేయబడిన వారు రిపబ్లిక్ డే కార్యక్రమాల్లో దాడి చేసే ప్రణాళికలు రూపొందించారని తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Read Also: Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

అరెస్టైన నిందితుల వివరాలు
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టైన నిందితులు:
- శరణ్ ప్రీత్ సింగ్
- దిల్జోత్ సింగ్ సైని
- హర్మాన్
- అజయ్
- అర్ష్‌దీప్ సింగ్
అదేవిధంగా, ఈ ముఠాను అమెరికా ఆధారిత బబ్బర్ ఖల్సా(Security Alert) హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తు తెలియజేస్తోంది. వారి ఆదేశాల మేరకు నిందితులు వివిధ ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించారని గుర్తించారు.
దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు ముమ్మరం
ఉగ్రవాద ముఠాలు పలు ప్రాంతాల్లో దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు భావించి, దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముఖ్య నగరాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలను పెంచాయి. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి గణతంత్ర దినోత్సవ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మరింత ఉగ్ర కుట్రలు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించి, నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: