జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చదువులో వెనుకబడిందన్న కారణంతో స్నేహితురాళ్లు చేసిన అవమానం తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థిని తన ప్రాణాలు కోల్పోవడం విద్యార్థుల లోలోపల గుండెను కలిచివేసింది.పోలీసుల కథనం ప్రకారం, జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (Kukatpally Housing Board Colony) లో ఓ ప్రైవేటు వసతి గృహంలో నివసిస్తూ, అక్కడే ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చదువులో మంచి ప్రతిభ కలిగిన నిత్య ఇటీవల కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏ మేరకు బాధపడ్డదో అర్థం చేసుకోవచ్చు
ఇటీవల, ఆమెకు ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితురాళ్లు నిత్యను “చదువులో వెనుకబడావు, నీ వల్ల కాదు” అంటూ అవమానించారట. ఈ మాటలు నిత్య మనసులో బలంగా ముద్రపడ్డాయి. స్నేహితులే ఇలాంటివి మాట్లాడారంటే ఏ మేరకు బాధపడ్డదో అర్థం చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నిత్య, జూలై 2వ తేదీన ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రంగా మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడ నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన నిత్య, పరిస్థితి మెరుగుపడక అక్కడే శనివారం(జూలై 05) రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్సై సుధాకర్ (Jagityala Rural SI Sudhakar) తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంగారు భవిష్యత్ ఉన్న అమ్మాయి చనిపోవడంతో తల్లిదండ్రులు జీర్ణిచుకోలేకపోతున్నారు.

చిన్న మాటలతో ఎంతటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయో
ఆత్మహత్యకు దారితీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిత్య ఫోన్ డేటా, హాస్టల్ ఫ్రెండ్స్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ కొనసాగుతోందని చెప్పారు.ఈ సంఘటన విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం (mental health) పై మరింత అవగాహన అవసరమని సూచిస్తోంది. చిన్న మాటలతో ఎంతటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. యువతకు ఒత్తిడిలో ఎలా స్పందించాలో నేర్పించాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా మారింది.విద్యార్థుల మధ్య అవమానకర వ్యాఖ్యలు, ఎదురు మాటలు ఎంతటి తీవ్రంగా ప్రభావం చూపుతాయో, నిత్య మృతి అందుకు దుర్ఘటనగా నిలిచింది. ఒక చిన్న మాట, ఓ అవమానం ఎంతటి వెలకట్టలేని నష్టాన్ని కలిగించవచ్చో ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Weather Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన