Nellore Crime: నమ్మకంతో వచ్చిన భార్యను అనుమానంతో కబళించాడో కిరాతక భర్త. పచ్చని సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి, ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపింది.
Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

అనుమానం పెంచిన దూరం
పోలీసుల సమాచారం ప్రకారం.. నందిని, శ్రీహరిలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే, గత కొంతకాలంగా భార్య నందిని ప్రవర్తనపై శ్రీహరి అనుమానం పెంచుకున్నాడు. ఈ మనస్పర్థల కారణంగా దంపతులిద్దరూ గత తొమ్మిది నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. నందిని తన జీవనోపాధి కోసం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
ప్రేమగా పిలిచి.. ప్రాణం తీసి..
శనివారం ఉదయం బెంగళూరు నుంచి నెల్లూరు చేరుకున్న నందినిని తీసుకెళ్లడానికి శ్రీహరి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అంతా సవ్యంగానే ఉందనుకుని ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. అయితే, నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపానికి చేరుకోగానే శ్రీహరి తన(Husband kills wife) అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా నందిని గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: