हिन्दी | Epaper

Mumbai Crime: చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

Anusha
Mumbai Crime: చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

Mumbai Crime: ముంబై నగరంలో అత్యంత విచారకరమైన, వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే ముగ్గురు స్నేహితులు ఒక రాత్రి చేపలు తెచ్చుకుని ఎంతో ఇష్టంగా ఫ్రై చేసుకున్నారు. అవి వేడిగా ఉన్నాయని, కాసేపు ఆగి చల్లబడ్డాక తిందామని పెనం మీద పెట్టి నిద్రపోయారు. అయితే, మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి పెనం మీద చేప ముక్కలు కనిపించలేదు.

Read Also: Yadadri incident: గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

అనుమానంతో ప్రాణాలు తీశారు

పెనం మీద చేపలు లేకపోవడంతో, పక్కనే నిద్రపోతున్న తమ మూడో స్నేహితుడే వాటిని దొంగతనంగా తినేశాడని మిగిలిన ఇద్దరు భావించారు. ఆకలితో ఉన్న వారు కోపంతో ఊగిపోయి, గాఢ నిద్రలో ఉన్న స్నేహితుడిని నిలదీశారు. అతను తనకు తెలియదని మొత్తుకున్నా వినకుండా, విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. కేవలం కొన్ని చేప ముక్కల కోసం ప్రాణ స్నేహితుడిని బలితీసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఇదీ జరిగింది?

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో 35 ఏళ్ల అఫ్సర్ అనే వ్యక్తి.. తన స్నేహితులు సురేష్, రాజేష్‌లతో కలిసి నివసిస్తున్నాడు. వీరంతా పాత సామాన్లు సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే గత నెల ఫిబ్రవరి 24వ తేదీన రాత్రి వీరి ముగ్గురు కలిసి చేపలు తెచ్చుకున్నారు. ఎంచక్కా ఫ్రై కూడా చేసుకున్నారు. కానీ అవి వేడిగా ఉండడంతో.. చల్లారాక తినాలని పడుకున్నారు. అయితే ఆ సమయంలో అఫ్సర్ మద్యం సేవించి ఉన్నాడు. ముగ్గురికీ బాగా నిద్ర పట్టింది. కాసేపయ్యాక లేవాలని అనుకున్నా నిద్ర బాగా పట్టడంతో.. మరుసటి రోజు ఉదయమే సురేష్, రాజేష్‌లు నిద్ర చేశారు.

Mumbai Crime: Friend killed for fish.. Seriously!
Mumbai Crime: Friend killed for fish.. Seriously!

వెంటనే ఆకలి వేయడంతో.. చేపలు తినాలని వెళ్లారు. కానీ పెనం మీద ఒక్క చేప ముక్క కూడా కనిపించలేదు.దీంతో మద్యం మత్తులో ఉన్న అఫ్సరే రాత్రి తిని ఉంటాడని భావించి.. అతడిని అడిగారు. అతడు తాను తినలేదని చెప్పినా నమ్మలేరు. మత్తులో ఉండడం వల్ల ఎంచక్కా తిని ఆ విషయాన్ని మర్చిపోయాడని భావించారు. దీంతో అతడిపై విపరీతమైన కోపంతో ఊగిపోతూ.. సురేష్, రాజేష్‌లు అఫ్సర్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. కోపం కట్టలు తెంచుకోవడంతో పక్కనే ఉన్న ఒక బండరాయితో అఫ్సర్ తలపై బాదారు. తీవ్ర రక్తస్రావం అయి అఫ్సర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితులు హర్యానాకు పారిపోయారు.

అయితే స్థానికుల ద్వారా అఫ్సర్ హత్య విషయం తెలుసుకున్న వాన్‌రాయ్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నిందితులకు మొబైల్ ఫోన్లు గానీ, ఎలాంటి గుర్తింపు కార్డులు గానీ లేకపోవడంతో దర్యాప్తు కష్టతరమైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు.. ఆ ప్రాంతంలోని దాదాపు 50 మంది చెత్త సేకరించేవారిని విచారించారు. చివరకు నిందితుల ఆచూకీ కనుగొని.. హర్యానాలో సురేష్‌ను, ఒక రైల్వే స్టేషన్‌లో రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారించగా.. ఈ హత్యోదంతం బయటపడింది. ముఖ్యంగా చేప ముక్కల కోసమే హత్య చేశామని నిందితులు ఒప్పుకోగా.. అవి ఎలుకలు తిన్నాయనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఇల్లంతా చూస్తే ఆ విషయం మీకు అప్పుడే అర్థం అయి ఉండేదని కూడా నిందితులకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870