నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎంను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎంలో తరలిస్తున్న టైల్స్ ఒక్కసారిగా కూలీలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

సహాయక చర్యలు – కేసు నమోదు
హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో రహదారిపై అడ్డంగా ఉన్న సిమెంట్ ట్యాంకర్, డీసీఎంను తొలగింపజేసి ట్రాఫిక్‌ను(Miryalaguda) పునరుద్ధరించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: