हिन्दी | Epaper

Mirjalaguda: అర్ధరాత్రి బుల్డోజర్ లతో 16 షాపుల కూల్చివేత

Anusha
Mirjalaguda: అర్ధరాత్రి బుల్డోజర్ లతో 16 షాపుల కూల్చివేత

హైదరాబాద్‌ శివారులోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది.మల్కాజిగిరి పోలీస్ స్టేషన్(Malkajgiri Police Station) పరిధిలోని మీర్జాలగూడాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో 16 షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగించారు.మల్కాజిగిరిలో అర్ధరాత్రి సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని, తన భవనంలో కిరాయికి ఇచ్చిన 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు. ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఈ షాపుల్లో కొంతమంది 15 ఏళ్లకుపైగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ, “మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాం, దయచేసి కొంత సమయం ఇవ్వండి” అని కోరారు. అయితే, యజమాని ఆ మాటలకు ఒప్పుకున్నట్లు కనిపించి, అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపుల షట్టర్లను తీసేశారు.

Mirjalaguda: అర్ధరాత్రి బుల్డోజర్ లతో 16 షాపుల కూల్చివేత
Mirjalaguda

స్థానికంగా

ఈ చర్యతో షాప్ యజమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న సరుకులు, డబ్బులు అన్ని గల్లంతయ్యాయని ఆరోపించారు. వెంటనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. “రాత్రి సమయంలో అలా నిబంధనలకు విరుద్ధంగా చేయడమేమిటి? మేము ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాం. కానీ ముందే చెప్పకుండా ఇలా చెయ్యడం అన్యాయం” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పూర్తిగా తన ఇష్టానుసారం వ్యవహరించిన బిల్డింగ్ యజమాని చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోర్టులో పిటిషన్(Petition) వేశారు. ఇప్పుడిది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

Read Also: Gadwal: ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికుల నిరసన సెగ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

📢 For Advertisement Booking: 98481 12870