
Vizag Road Accident: విశాఖపట్నంలోని బీహెచ్‌పీవీ (BHPV) జంక్షన్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఒక లారీ, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం.
Read Also: Chandrababu Naidu: అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
విషాదంలో కుటుంబాలు
ఈ ప్రమాద ధాటికి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు గుర్తుపట్టలేనంతగా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఒకరిని రామకృష్ణగా గుర్తించారు. ఆయన తన కూతురుతో కలిసి సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం స్థానికులను కలచివేసింది. మరో మృతుడిని సతీష్‌గా పోలీసులు గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: