हिन्दी | Epaper

Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

Anusha
Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

హైదరాబాద్ లో మానవ సంబంధాల విలువను ప్రశ్నించేలా జరిగిన ఈ ఘటన జీడిమెట్ల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ పదవ తరగతి విద్యార్థినీ తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.జీడిమెట్ల (Jedimetla) లో ఓ పదవ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించి, మందలించినందుకు తల్లిని కిరాతకంగా చంపేసింది. ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లి ఊసురు తీసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్లకు చెందిన బాలిక స్థానికంగా పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ(19) అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఫోన్లు, మెసేజ్‌ (Message) లతో పాటు చెట్టాపట్టాలేసుకొని తిరగటం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది.

Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు

తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది.ఇద్దరూ కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు. గొంతు నులుమి, తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: MGNREGS: రికార్డు స్థాయిలో తెలంగాణలో ఉపాధి హామీ పనులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870