हिन्दी | Epaper

Hyderabad: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Sharanya
Hyderabad: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన జరిగింది. ఐటీ హబ్ హైటెక్ సిటీ సమీపంలోని ప్రసిద్ధమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Durgam Cheruvu Cable Bridge) వద్ద ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నగరవాసుల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి పేరు సుష్మ (వయస్సు 27)గా పోలీసులు గుర్తించారు.

ఆఫీసుకు వెళ్లి తిరిగి రాని యువతి… కుటుంబంలో ఆందోళన

పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం, సుష్మ బుధవారం ఉదయం హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

దుర్గం చెరువు సమీపంలో మృతదేహం వెలికితీత

బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. విచారణ చేపట్టగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు.

ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా బయటపడలేదు. సుష్మ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.

ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు

ఈ విషాదకర ఘటన సుష్మ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉంటుందో అర్ధం కావడంలేదని వాపోతున్నారు.

Read also: School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

📢 For Advertisement Booking: 98481 12870