అనుమానం ఎంతటి గొడవకీ, విషాదానికీ కారణమవుతుందనే దానికి తాజాగా హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన నిదర్శనం.భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, గోల్కొండ ప్రాంతానికి చెందిన జకీర్ అహ్మద్ (31)కు ఇద్దరు భార్యలు. వీరిలో రెండో భార్య నాజియాబేగం (30). ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కొంతకాలంగా నాజియాబేగం(Naziabegam)పై జాకీర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో పదిహేను రోజుల క్రితం జల్‌పల్లి కొత్తపేట కాలనీకి మకాం మార్చాడు. అయినప్పటికీ జాకీర్ తన భార్యను రహస్యంగా గమనిస్తూనే ఉన్నాడు.ఈ నెల 13వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో జకీర్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పిల్లలు మరో గదిలో ఉన్నారు. నాజియాబేగంతో జాకీర్(Zakir)కు వివాహేతర సంబంధం విషయమై తీవ్ర వాగ్వివాదం జరిగింది. సహనం కోల్పోయిన జాకీర్ మొదట కర్రతో నాజియాబేగం తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా కిటికీ అద్దాన్ని పగులగొట్టి గాజు ముక్కతో ఆమె కుడిచేతి నరాలను కోశాడు. చివరిగా, చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఫిర్యాదు
పిల్లలు జరిగిన ఘోరాన్ని వెంటనే తమ అమ్మమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. నాజియాబేగం తల్లి, సోదరుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన దారుణాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు జాకీర్ అహ్మద్ కోసం గాలిస్తున్నారు.
Read Also : Permission : సులభతరంగా అనుమతుల ప్రక్రియ – సీఎం రేవంత్