हिन्दी | Epaper

Bihar: సస్పెండ్ అయిన బిహార్​ పోలీస్​ ఇంట్లో భారీ ఆయుధాలు

Anusha
Bihar: సస్పెండ్ అయిన బిహార్​ పోలీస్​ ఇంట్లో భారీ ఆయుధాలు

బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఒకవైపు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన పోలీసు అధికారి ఇంట్లో అకస్మాత్తుగా నిర్వహించిన సోదాలు ఇప్పుడు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఓ ఏఎస్ఐ ఇంట్లో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. అది కూడా అధునాతన ఏకే 47, ఏకే 56 వంటి ఆయుధాలు కావడం అలాగే, వెతుకుతున్న కొద్దీ బుల్లెట్ మ్యాగ్జిన్లు(Bullet magazines) లభిస్తుండంతో సోదాలకు వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసులకు ఇప్పటి వరకు దాదాపు 500 రౌండ్ల బుల్లెట్లు లభించగా, ఇంకా సోదాలను కొనసాగిస్తున్నారు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన సంచనలంగా మారింది.

రవాణా చేయడం

అవినీతి ఆరోపణలతో ఏఎస్ఐ సరోజ్ సింగ్(ASI Saroj Singh) ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, నేరస్థులతో చేతులు కలిపి అక్రమంగా ఆయుధాలను రవాణా చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల హత్యకు సరోజ్ సింగ్​తో పాటు అతని అనుచరులు ముగ్గురు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. హత్యల కోసం ఆయుధాలను సమకూర్చుకున్నట్లు తెలిసింది. దీంతో STFతో పాటు, పటోరి మోహన్‌పూర్, మొహద్దినగర్, విద్యాపతి నగర్ పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసులు సంయుక్తంగా దాడి చేసారు. పోలీసులను చూసిన సరోజ్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇదే సమయంలో పోలీసులపై కాల్పులు కూడా జరిపారు.

Bihar: సస్పెండ్ అయిన బిహార్​ పోలీస్​ ఇంట్లో భారీ ఆయుధాలు
Bihar

తుపాకులను స్వాధీనం

సమస్తిపూర్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలు నిల్వ ఉంచిన ఆరోపణలపై పోలీసులు సరోజ్ సింగ్ సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.అనంతరం సరోజ్ సింగ్ ఇంట్లో సోదాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి నుంచి దాదాపు 500 రౌండ్ల బుల్లెట్లు, ఏకే 47, ఏ56,(AK 47, A56) డబుల్ బారెల్ గన్, మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు ఇంకా లభించే అవకాశం ఉండటంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయుధాలు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంకా ఆయుధాలు ఉండే అవకాశం ఉందని భావించి పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Read Also: Uttarakhand: రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. పలు షాపులు ధ్వంసం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870