మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయి.నెమ్మదిగా మొదలైన వ్యాప్తి ఇప్పుడు వేగం పెరిగింది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ భయం మొదలైంది. సరిగ్గా ఇప్పుడే వర్షాకాలం కూడా మొదలైంది. భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులు(Seasonal diseases) మొదలయ్యాయి. చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి. అయితే ఇప్పుడే కొవిడ్ కూడా వ్యాప్తి చెందుతుండడం వల్ల జలుబు, జ్వరం కరోనా కారణంగా వచ్చాయా. లేదా కేవలం ఫ్లూ(FLU) వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అన్నది తేల్చుకోవడమే సవాలుగా మారింది. సాధారణ ఫ్లూ లక్షణాలు, కొవిడ్ వైరస్ సింప్టమ్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే ఏ లక్షణాలు దేనివో తెలుసుకోవడమే చాలా ముఖ్యం. దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ తేడా ఎలా తెలుసుకోవాలి. సీజనల్ ఫ్లూతో పోల్చి చూస్తే కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి.
లక్షణాలు
JN1 వేరియంట్ అనుకున్న దాని కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాల్నీ అలెర్ట్ అయ్యాయి. సాధారణంగా ఫ్లూ సోకినప్పుడు విపరీతంగా జ్వరం వస్తుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు, నీరసంతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయి. కొందరు డయేరియాతో ఇబ్బంది పడతారు. అయితే కొవిడ్(Covid) సోకిన వాళ్లలోనూ దాదాపు ఇవే సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈ రెండింటిలో తేడా తెలుసుకోవడం కాస్త కష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని సార్లు టెస్ట్ చేస్తే తప్ప అది ఏమిటన్నది తెలియదు. ముఖ్యంగా కొవిడ్ విషయంలో మాత్రం టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. అంటే అది సీజనల్ వ్యాధా లేదా కరోనా అని తెలియాలంటే టెస్ట్ చేసుకోక తప్పదు. అయితే ఇప్పుడు సోకుతున్న కొత్త వేరియంట్ మాత్రం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇమ్యూనిటీని కూడా ఛేదిస్తోంది. వ్యాప్తిలో ఎలాంటి మార్పు లేకపోయినా సింప్టమ్స్ లో మాత్రం కొన్ని తేడాలు కనిపించే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన
సాధారణ ఫ్లూకి, కరోనాకి ఉండే అతి పెద్ద తేడా ఆక్సిజన్ సాచురేషన్. అంటేఊపిరి అందకపోవడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం. ఫ్లూతో పోల్చి చూసినప్పుడు కొవిడ్ వైరస్ సోకితే ఆక్సిజన్ లెవెల్స్(Oxygen levels) ఉన్నట్టుండి పడిపోతాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపించే సింప్టమ్ ఇది. రుచి వాసన కోల్పోవడం కరోనా సోకినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు. సాధారణ ఫ్లూ వచ్చినప్పుడు ఈ సింప్టమ్స్ ఉండవు. అయితే ఫ్లూలోనూ కొన్ని రకాలుంటాయి. మరీ తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు కరోనా మాదిరిగానే రుచి వాసన కోల్పోయే ప్రమాదముంటుంది. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
Read Also : ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు