हिन्दी | Epaper

Abhishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

Anusha
with-love-telugu-trailer-released
with-love-telugu-trailer-released

ఇటీవల కాలంలో ప్రేమకథా సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అతి త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషన్ (Abishan Jeevinth) హీరోగా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.తాజాగా ఆయన ‘విత్ లవ్’ (With Love) అనే క్యూట్ లవ్ స్టోరీతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Read Also: Anirudh Ravichander: టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది

కీల‌క పాత్ర‌ల్లో

మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) హీరోగా నటిస్తుండగా, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 06న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా.. తాజాగా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, స‌చిన్ నాచిప్ప‌న్‌, తేని మురుగ‌న్‌, శ‌ర‌వ‌ణ‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేను తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ
0:57

నేను తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

📢 For Advertisement Booking: 98481 12870