हिन्दी | Epaper

Vijayashanthi: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న విజయశాంతి

Anusha
Vijayashanthi: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న విజయశాంతి

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.ఈ చిత్రం శుక్రవారం, ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా,ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన పొందుతోంది.మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

చాలా బాగా

సక్సెస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ తన కుమారుడికి చాలా బాగా నచ్చిందని తెలిపారు. మనం నమ్మిన కొన్ని విషయాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్. అమ్మ విజయశాంతితో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర వేశారు. ఆయన పాత్రకి సంబంధించిన ట్విస్ట్ బాగుందని అంటున్నారు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ ఇలా ప్రతీ అంశాన్ని అందరూ పొగుడుతున్నారని,అజనీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది. క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. ఈరోజు పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి వచ్చాడు. ‘నాన్నా ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకూ చూడలేదు. ఇది నిజమా అని నేను షాక్ కి గురయ్యాను. చాలా గర్వంగా ఉంది నాన్న’ అని అన్నాడు. తల్లీ కొడుకుల మధ్య ఎమోషన్ ని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశ్యం. తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాం, ఎంత త్యాగం చేసాం అనేది ముఖ్యం కాదు. వారి పట్ల మనం ఎంత బాధ్యతగా ఉన్నాం. ఎంత దూరం వెళ్ళాం అనేది ఈ సినిమా ద్వారా చెప్పాం కళ్యాణ్ రామ్ అన్నారు.

 Vijayashanthi: 'అర్జున్ సన్ ఆఫ్  వైజయంతి' మూవీ  సక్సెస్ మీట్ లో పాల్గొన్న విజయశాంతి

హ్యాట్సాఫ్

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ”సినిమా గురించి రివ్యూలలో మంచి మాటలు రాసిన వారందరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రాదాభివందనాలు. ఈ సినిమా ఇంత మంచి హిట్ అయిదంటే ఆ క్రెడిట్ అంటా ప్రజలకే ఇవ్వాలి. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఈ సినిమాలోని క్లైమాక్స్ ని ఇంకో హీరో అయితే కచ్చితంగా ఒప్పుకునేవాడు కాదు. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇమేజ్ ఏమైపోతుంది? అని రకరకాల ఆలోచనలు చేస్తారు. కానీ కళ్యాణ్ రామ్ అంత రిస్క్ చేసుకొని ఆ సీన్ చేసాడు. ఆయనకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్” అని అన్నారు.

Read Also: Brahmotsavam Movie: మే 30న బ్రహ్మోత్సవం మూవీ రీ-రిలీజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

📢 For Advertisement Booking: 98481 12870